చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చాలా చిన్న సినిమాలను చిన్న హీరోలను ప్రోత్సహించే రాజమౌళి దృష్టి ఈసారి ఒక టాప్ హీరోయిన్ పై పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. భారీ సినిమాలను తీసే రాజమౌళి ఈసారి త్రిషను ప్రమోట్ చేస్తూ రంగంలోకి దిగడమే కాకుండా ఆమెను అభినందిస్తూ ట్విట్స్ ను కూడ పెడుతున్నాడు.

త్రిష  ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘నాయగి' స్టిల్స్ విడుదలై అందరి ‘దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాను ‘నాయకి’ పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. మీడియాకు విడుదల చేసిన ఈ సినిమా స్కిల్స్ లో త్రిష సాంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని అందమైన స్మైల్ విసురుతూ ఒక చేతిలో కత్తి మరొక చేతిలో పూలసజ్జ పట్టుకున్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. 

దీని పై రాజమౌళి తన సోల్ నెట్వర్కింగ్ పేజీలో స్పందిస్తూ ‘త్రిష గెటప్, స్మైల్, ఆమె చేతిలో కత్తి, జస్ట్ కిల్లింగ్’ అంటూ ప్రశంసలు గుప్పించాడు రాజమౌళి. హర్రర్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా  షూటింగ్‌ నిన్న చెన్నైలో వినాయకుడి ఆలయం వద్ద ప్రారంభం అయింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేసిన త్రిష మొట్టమొదటిసారిగా ప్రేక్షకులను భయ పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాగా నిర్మాణం అవుతున్న ఈసినిమా పై త్రిష చాల ఆశలు పెట్టుకుంది. 1980 కాలంనాటి కథ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈసినిమాలోని తన పాత్ర ‘చంద్రముఖి’ లా తనకు పేరు తెస్తుందని త్రిష అంచనా. అయితే ఈసినిమాలో త్రిషది హంతకురాలి పాత్రా లేదంటే దెయ్యం పాత్రా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. నటిగా 15 ఏళ్ళు కెరియర్ ను పూర్తి చేసుకున్న త్రిషకు ఈ ‘నాయకి’ ఎటువంటి మలుపును తిప్పుతుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: