సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' సినిమా కథ గతంలో కమలహాసన్ నటించిన సినిమా కథను పోలి ఉంటుంది అనే అనుమానాలను కోలీవుడ్ మీడియాలో కొన్ని వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి. ఈ సినిమా కథ వెబ్ మీడియాకు లీక్ కావడంతో ప్రస్తుతం చాల మంది ఈ కథ గురించి చర్చించుకుంటున్నారు. 

ఈసినిమాలో రజినీ ఒక మాఫియా డాన్ గా కనిపిస్తాడు అన్న విషయం ఇప్పటికే బయటకు లీక్ అయింది. ఈసినిమా కథ ఒకప్పటి మద్రాస్ మైలాపూర్ డాన్ కబలీశ్వరన్ రియల్ లైఫ్ ఆధారంగా నిర్మిస్తున్న నేపధ్యంలో రజనీ రియల్ లుక్ తోనే ఈ మూవీలో నటిస్తాడని కూడా ప్రచారంలో ఉంది.  తెలుగులో  ‘కపాలి’   లేదా "కాళి” టైటిల్ తో డబ్ అయ్యే ఈ సినిమా కథ 1987 లో విడుదలైన మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నాయకుడు’ సినిమాకు పోలి ఉంటుందని టాక్. 

ఆ సినిమాలో కమలహాసన్ రియల్ లైఫ్ డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితాన్ని పోలి ఉంటే ప్రస్తుతం రజినీ సినిమా చెన్నై డాన్ కబలీశ్వరన్ రియల్ స్టోరీని పోలి ఉండటంతో కోలీవుడ్ మీడియా ఈ కామెంట్స్ చేస్తోంది. ఈ సినిమా కథ అంతా మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. 

మలేషియాలో ఇండియా లేబర్ ముఖ్యంగా తమిళులు ఎక్కువ. అక్కడ వారితో ఒక తమిళ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ పూర్తిగా నడుస్తుందని టాక్. అక్కడి వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారట. ఈకథతో పాటుగా ఈ సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ కూడ ఉండబోతోందని టాక్. ఎట్టి పరిస్తుతులలోను తన అభిమానులకు సూపర్‌ హిట్ ఇచ్చి తీరాలి అని రజినీ చాల పట్టుదలగా నటిస్తున్న ఈసినిమా పై చాల భారీ అంచనాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: