ఈ మాట అంటుంది ఎవరో తెలుసా..నేచురల్ స్టార్ నానీ తనయుడు అర్జున్.  ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జర్సీ’చిత్రం రూపొందింది.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని .. అర్జున్ పాత్రలో కనిపించబోతున్నాడట.  అయితే ఈ చిత్రంలో నాని .. అర్జున్ పాత్రలో కనిపించనుండగా, నాని తనయుడు అర్జున్ .. నాని పాత్రలో సందడి చేయనున్నాడు. ప్రస్తుతం జెర్సీ చిత్రానికి సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు మేకర్స్‌.  తాజాగా నాని ఆయన తనయుడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో నాని, అర్జున్‌లు బోటులో జెర్సీలు ధరించి కూర్చొని ఉండగా, నాని జెర్సీపై అర్జున్ పేరు రాసి ఉంది.

అర్జున్ జెర్సీపై మా డాడీ నా పేరు దొంగిలించాడు అని ఉంది. దీనికి నాని .. సారీ రా తప్పలేదు జున్ను అని కామెంట్ పెట్టాడు. నాని తనయుడు అర్జున్‌ 2017, మార్చి 29న జన్మించాడు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: