పూర్తిగా పాజిటివ్ టాక్ లో రన్ అవుతున్న ‘మహర్షి’ సాధారణ ప్రేక్షకుల నుండి సెలెబ్రెటీల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసినిమా కోసం మహేష్ తన సమ్మర్ వెకేషన్ ను కూడ వాయిదా వేసుకుని ఈమూవీ ప్రమోషన్ కోసం మండుతున్న ఎండలను కూడ లెక్క చేయకుండా మహేష్ ఈమూవీ ధియేటర్స్ వద్దకు వెళ్లి ఈమూవీని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ సినిమాను చూసిన మహేష్ పిల్లల రియాక్షన్ ను స్వయంగా మహేష్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను చూసిన తరువాత తన కూతురు సితార కళ్ళలో నీళ్ళు కనిపించాయని గౌతం గట్టిగా కౌగిలించుకున్నాడని వాళ్ళ సంతోషాన్ని చూసాక తన నమ్మకం రెట్టింపు అయి తాను ‘మహర్షి’ చేసినందుకు ఫలితం దక్కింది అన్న ఫీలింగ్ వచ్చిన విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. 

అంతేకాదు ‘మహర్షి’ సినిమా చేసాక తన ఆలోచనలలో మార్పు వచ్చింది అన్న విషయాన్ని తెలియచేస్తూ మూలాలను తెలుసుకోవడానికి కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా తన ఊరు వెళ్ళే ఆలోచన తాను చేస్తున్న విషయాన్ని బయట పెట్టాడు మహేష్. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి కలక్షన్స్ సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లో చాల స్లోగా ఉన్నా ఈమూవీ పికప్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో మహేష్ తన సర్వశక్తులు ఒడ్డి ఈమూవీని ప్రమోట్ చేస్తున్నాడు. 

దీనికితోడు ఈసినిమాకు పోటీ ఇచ్చే మరొక సినిమా ఏదీ ఇప్పట్లో విడుదల లేకపోవడంతో ‘మహర్షి’ బయ్యర్లు అంతా లాభాల బాట పడతారు అన్న ధైర్యాన్ని ఈమూవీ నిర్మాతలు కలుగ చేస్తున్నారు. అయితే ఈమూవీ బాగుంది అని అందరు చెపుతున్నా ఈమూవీకి రిపీతేడ్ ఆడియన్స్ రాకపోవడం ఒక సమస్యగా మారడంతో ‘మహర్షి’ టాక్ లో బ్లాక్ బస్టర్ హిట్ కలక్షన్స్ విషయంలో కేవలం హిట్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏ స్థాయికి ‘మహర్షి’ చేరుకుంటుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: