మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా జూన్ 26 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  విజయశాంతి పోషించే పాత్రే సినిమాకు హైలైట్ గా ఉండబోతుంది. 13 ఏళ్ల క్రితం అంటే 2006 వ సంవత్సరంలో విజయశాంతి నాయుడమ్మ సినిమాలో చేసింది.  

ఆ తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమాలు చేయలేకపోయింది.  ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరలా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. 

రాజకీయాల్లో ఉండటం వలన ఫిట్నెస్ పై సరైన శ్రద్ద వహించలేదు.  సినిమా అంటే గ్లామర్ గా కనిపించాలి.  గ్లామర్ గా కనిపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  ఇప్పుడు విజయశాంతి కూడా అదే ప్రయత్నం చేస్తోంది.  

జిమ్ కు వెళ్లి తిరిగి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుందట.  సినిమాల్లో నటించాలంటే ఫిట్ గా ఉండాలని, అలా లేకుంటే ఇబ్బందులు వస్తాయని అంటోంది విజయశాంతి.  పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న విజయశాంతి.. ఆ పవర్ఫుల్ పాత్ర ఏంటి అన్నది తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: