ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంలో రోజాకు స్థానం లేకపోవడం పై విజయశాంతి ఆశక్తికర కామెంట్స్ చేసింది. ఫిలిం సెలెబ్రెటీలను రాజకీయ ప్రచారాలకు ఉపయోగించుకుని ఆతరువాత పట్టించుకోకపోవడం ఒక సాంప్రదాయంగా మారిందని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

అంతేకాదు ఇటువంటి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పిస్తే బాగుంటుందని విజయశాంతి జగన్ మోహన్ రెడ్డికి సూచన చేసింది. ప్రస్తుతం రోజాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మార్గం లేని సందర్భంలో విజయశాంతి సూచన ఎంత వరకు ఫలిస్తుంది అన్నది సందేహమే.

దీనికితోడు రోజాకు మంత్రి పదవి రాకపోవడం వెనుక కొన్ని అంతర్గత శక్తులు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసాయి అని రోజా తనను కలిసిన తన సన్నిహితులతో బాధపడుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో రోజాకు ఏదైనా ఒక ముఖ్యమైన కార్పరేషన్ చైర్మన్ హోదా వచ్చినా అది మంత్రి పదవితో సమానం కాకపోయినా మారిన రాజకీయ పరిస్థితులలో పడటం తప్ప మరో మార్గం లేదు. 

లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం పదవి రానందుకు అసంతృప్తితో ఉన్న రోజాకు ముఖ్యమంత్రి జగన్ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆమె ఈరోజు జగన్ ను కలవడానికి బయులుదేరినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజాకు సద్దుబాటు చేసి ఎలాంటి పదవి ఇస్తారు అన్న విషయమై ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: