సమీరా రెడ్డి సినిమాల నుంచి తప్పుకున్నాక చాలా లావుగా మారిపోయింది. చాలా కాలం తరువాత సమీరా సడెన్ గా కనిపించే సరికి ఎవరు గుర్తుపట్టలేకపోయారు. దీంతో సమీరాపై కామెంట్లు చేశారు. లావుగా మారిందంటూ విమర్శలు చేశారు. దీంతో సమీరాకు కోపం వచ్చింది.
ఈ కోపంతో సమీరా బేబీ బంప్ ఫోటోను పెట్టి తన గురించి మాట్లాడిన వాళ్లకు ఇదే తన సమాధానం అంటూ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇదే విధమైన కామెంట్స్ విద్యాబాలన్ విషయంలో కూడా వస్తున్నాయి. విద్యాబాలన్ ఓవర్ వెయిట్ గా ఉండటంతో సినిమాల్లో లావుగా కనిపిస్తుందంటూ పోస్ట్ చేస్తున్నారు.
దీనిపై విద్యాబాలన్ మండిపడింది. తనను విమర్శించే వారు ముందు వాళ్ళ సంగతి చూసుకోవాలని హితవు పలికింది. తన లావు గురించి తనకు తెలుసునని, అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తనకు ఎలా చేయాలో తెలుసు అంటూ మండిపడింది.
తెలుగులో విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేసింది. ఇందులో రెండు పార్ట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ మహానాయకుడు కాగా రెండో సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.