అస్మిత కర్నాని తెలుగులో పాపులర్ సీరియల్ నటి. ఈటీవీలో వచ్చే "పద్మవ్యూహం" సీరియల్ తో బుల్లితెర మీద పేరు తెచ్చుకుంది. దాదాపుగా పది సంవత్సరాలుగా బుల్లితెర మీద నటిస్తుంది. రాజస్థాన్ లో పుట్టిన ఈమె తెలుగు బుల్లితెర మీద చాలా పాపులర్ నటి. అమ్మగా, చెల్లిగా, భార్యగా విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఇప్పటి వరకు పదిహేను కంటే ఎక్కువ సీరియల్లలో నటించింది. అయితే ఈమె నుండి తాజాగా ఒక వార్త బయటకి వచ్చింది.
పది సంవత్సరాల నుండి సీరియల్ రంగంలో ఉంటున్న అస్మితకి వివాహం జరిగింది. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలం క్రితమే తాను సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ఆస్మిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి వివాహం జరగగా.. శనివారం రోజున వీరి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు.
అస్మిత సీరియల్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. మురారి, అపుడపుడు, మధుమాసం,ఆపద మొక్కులవాడు, కలెక్టర్ గారి భార్య లాంటి సినిమాల్లో అస్మిత కనిపించింది. అస్మిత యురేకా ఫోర్బ్స్,ఆంధ్రా బ్యాంక్, ఆంధ్ర జ్యోతి,మరియు వెన్ కాబ్ చికె సంస్థల వాణిజ్య పరమైన ప్రకటనల్లో కూడా నటించింది. బుల్లితెర నటీమణికి ఇంత పేరు చాలా తక్కువ మందికి వస్తుంది.
కొరియోగ్రాఫర్ సుధీర్ తో వివాహం చేసుకుని, సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. శనివారం రోజు జరిగిన రిసెప్షన్ వేడుకకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పంజరం, పద్మవ్యుహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాహలక్ష్మి, మనసు మమత.. సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. అయితే పెళ్ళి తర్వాత సీరియల్లలో నటిస్తుందా లేదా అనే విషయం చెప్పలేదు.