సైరా..ఇప్పుడు టాలీవుడ్ లో మరో సంచలనం వచ్చేసింది.. అక్టోబర్ లో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నా ఈ భారీ మెగా మూవీ మేకింగ్ వీడియో ఈరోజు విడుదలైంది.. ఒళ్లుగగుర్పాటు కలిగించే సన్నివేశాలతో అంచనాలు మించింది. మెగా ఫ్యాన్స్ ఈ మేకింగ్ వీడియోతో పండుగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.


ఈరోజు మేకింగ్ వీడియో వస్తుందని ముందుగానే ప్రచారం జరిగింది. అందుకే ఈ సైరా మేకింగ్ ఇష్యూ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ట్రెండింగ్ అంశంగా మారింది. ఇండియా ట్రెండింగ్స్ లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 5 స్థానాల్లో నిలిచింది. సైరా మేకింగ్ నెంబర్ వన్ అంశంగా ఉంటే... సైరా నర్సింహారె‌డ్డి అంశం నెంబర్ 2 అంశంగా మారింది. ఇక సైరా ఇష్యూ హాట్ హాట్ గా మారడంతో .. మెగాస్టార్ చిరంజీవి అనే అంశం టాప్ 5 లో చేరింది.


ఇక సైరా విడుదలకు రెండు నెలలు మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్‌కు సన్నాహాలు ఉధృతం చేస్తోంది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయడం అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి రెండేళ్లుగా ఈ సినిమాకే అంకితమై పనిచేస్తున్నారు. తారాగణం కూడా భారీగా ఉంది.


సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమిళ హీరో విజయ్ సేతుపతి , కన్నడ నటుడు సుదీప్ , మిల్కీ బ్యూటీ తమన్నా వంటి వారు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తండ్రి ప్రధాన పాత్రధారిగా తనయుడు రామ్ చరణ్ రూపొందిస్తున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: