యూనివర్సల్ హీరో  కమల్ హాసన్ ,క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో  తెరకెక్కతున్నచిత్రం  'ఇండియన్ 2'  బడ్జెట్ కారణాల వల్ల  ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని ఇటీవల మేకర్స్  క్లారిటీ ఇచ్చారు.  ఇక ఎట్టకేలకు  లాంగ్  బ్రేక్ తరువాత  ఈచిత్రం యొక్క షూటింగ్   మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రకుల్  ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ , సిద్దార్థ్  లపై కొన్ని కీలక సన్నివేశాలను  తెరకెక్కిస్తున్నారు.  కాగా  ఈచిత్రంలో ప్రముఖ నటుడు సముద్ర ఖని కూడా  ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఈనెల చివర్లో  ఆయన షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.    


ఇక  కమల్ హసన్,  ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఇంకా పాల్గొనడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం  ప్రముఖ  రియాల్టీ షో  తమిళ్ బిగ్ బాస్ 3 కి ఆయన వ్యాఖ్యాత గా వ్యవహరిస్తుండడం తో   దాన్ని పూర్తి చేసి  ఆ తరువాత షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్  అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తుండగా  కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. సూపర్ హిట్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. 


ఇక ఈ చిత్రం సున్నితమైన అంశాలతో  తెరకెక్కుతుందట.  గతంలో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటనను ఇంకా పలు రేప్ కేసులను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. 1996లో వచ్చిన ఇండియన్ మూవీ తో లంచం గురించి సాలిడ్ మెసేజ్ ఇచ్చిన శంకర్..  ఇండియన్ 2 తో మరోసారి  అంతే గట్టిగా సందేశాన్ని ఇవ్వనున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: