అఙాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. 2014లో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తాడని వార్తలు వస్తున్నా సినిమాల్లో నటించనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. 
 
సినిమాలకు పవన్ పూర్తిగా దూరమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమాలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను వివరించే క్రమంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఈ సినిమా టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అంత గొప్పగా లేదనే విమర్శలు వస్తున్నాయి. 
 
చారిత్రాత్మక కథ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు చాలా ఫ్లాట్ గా చెప్పాడని టీజర్ వీక్షకుల నుండి స్పందన వస్తుంది. మెగాభిమానులు కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సినిమాలో చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ బాగుందని చెబితే మరికొందరు పవన్ వాయిస్ బాగాలేదని కామెంట్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే విడుదలైన సైరా నరసింహారెడ్డి టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి బాగా సూట్ అయ్యాడు. 270 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత వస్తున్న చారిత్రాత్మక చిత్రం కావటం సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్లస్ కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: