‘సాహో’ పరిస్థితి పూర్తిగా తేలిపోవడంతో తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లకు 50 కోట్ల నష్టం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ ను ఆధారంగా చేసుకుని ఏకంగా నిన్న 7 చిన్న సినిమాలు విడుదల కావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి ‘సాహో’ రిలీజ్ అయిన తరువాత ఆ మ్యానియాకు భయపడి రెండు వారాల వరకు ఒక్క సినిమా కూడ విడుదల కాదని అందరు భావించారు. ఈ అంచనాలకు భిన్నంగా ఆది సాయికుమార్ ‘జోడీ’ ‘దర్పణం’ ‘2 అవర్స్ లవ్’ ‘ఇట్’ ఉండిపోరాదే’ లాంటి మరో రెండు సినిమాలు హడావిడిగా ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కావడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఇన్ని చిన్న సినిమాలు విడుదలైనా అన్నింటికీ ధియేటర్స్ దొరికాయి అంటే ‘సాహో’ ను ఏ విధంగా ధియేటర్స్ నుంచి లేపెసారో అర్ధం అవుతుంది. వాస్తవానికి నిన్న విడుదలైన చిన్న సినిమాలలో ఆది సాయికుమార్ ‘జోడి’ తో సహా ఏ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. దీనితో ఈ చిన్న సినిమాలకు కనీసం రెండవ వారం పోస్టర్ పడుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి ఇలాంటి పరిస్థితి ‘సాహో’ కి కలక్షన్స్ పరంగా ఎంతో సహకరించాలి. అయితే ఈ మూవీకి వచ్చిన టాక్ రీత్యా ఎవరు ఈ సినిమాను రెండవ సారి చూడటానికి సాహసించరు. ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ ఎడిటింగ్ టైమ్ లో తీసివేసిన కొన్ని సన్నివేశాలను తిరిగి కలిపి ఆ విషయం పై ప్రకటన ఇచ్చి కనీసం ప్రభాస్ వీరాభిమానులు ‘సాహో’ ను మరొకసారి చూసే విధంగా ‘సాహో’ నిర్మాతల ఆలోచనలు ఉన్నాయని టాక్. అయితే ఇప్పటికే నిడివి పెరిగి పోయిన ‘సాహో’ ను ఇంకా పెద్దది చేస్తే కనీసం అభిమానులైన చూస్తారా అన్నదే ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: