సౌతిండియా స్టార్ కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్-2. ఈ చిత్ర‌ షూటింగ్ చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరుగుతోంది. ఇక్కడ కమల్ రహస్యంగా వ్యూహ రచన చేస్తున్న సీన్లను తీస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు పాత్రలతో ఒకరికి తెలియకుండా ఒకరితో రహస్యంగా మాట్లాడతారట. ఆయన ఎవరెవరితో ఏ విషయాల్లో వ్యూహరచన చేస్తున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ తదితరులు కూడా నటిస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'కు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మహిళలపై అఘాయిత్యాలు, మహిళా సాధికారత అంశంపై సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.


మ‌రి క‌మ‌ల్ కాజ‌ల్ వీరిద్ద‌రి జంట ఎలా ఉండ‌బోతుంది. వీరిద్ద‌రి మ‌ధ్య క‌థేంటి అన్న‌ది తెర‌మీద చూడ‌వ‌ల‌సిందే ఇక‌పోతే అప్ప‌ట్లో క‌మ‌ల్ స‌ర‌స‌న మ‌నిష‌కొయిరాల అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న పొంది బాక్సాఫీస్ ముందు మంచి హిట్ సాధించింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుంది క‌మ‌ల్ ఎవ‌రెవ‌రితో వ్యూహ‌ర‌చ‌న చేస్తారు అన్న‌ది తెలియాలి. ఇక‌పోతే క‌మ‌ల్ కి ఇలాంటి పాత్ర‌లు కొత్తేమి కాదు గ‌తంలో ఇలాంటివి ఆయ‌న చాలానే చేశారు. కాజ‌ల్ అగ్ర హీరోల‌కు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆమె ప్ర‌స్తుతానికి పెద్ద హీరోల‌కు హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాబ‌ట్టి ఆమె డిమాండ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. 


అలాగే కాజల్ కొత్త హెయిర్ స్టైల్ కు మారబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. కాజల్ హెయిర్ డ్రస్ కోసం అమెరికా నుండి నిపుణులను రప్పిస్తున్నట్లుగా కూడా తమిళ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. శంకర్ కథ పూర్తిగా చెప్పకుండానే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శంకర్ దర్శకత్వంలో చిన్న పాత్రను చేయాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది కాజల్ కు హీరోయిన్ ఛాన్స్ వస్తే కథ ఏంటీ అని కూడా అడుగుతుందా చెప్పండి. మొత్తానికి కాజల్ ఇండియన్ 2 లో ఫిక్స్ అయినట్లే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 న మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు . ఈ సినిమా షూటింగ్ ని రాయలసీమ, టైవాన్ , చెన్నై లో రూపొందించాలని ప్లాన్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: