తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న తెలుగు తో పాటు హిందీ కన్నడ, మలయాళ , తమిళ భాషల్లో విడుదలకు కానుంది. కాగా ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తాజాగా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం యొక్క అన్ని భాషల డిజిటల్ హక్కులను 40కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం.
అయితే శాటిలైట్ హక్కుల విషయం లో క్లారిటీ రావాల్సి వుంది. ఇక డిజిటల్ హక్కులు ఈరేంజ్ లో ధర పలకడంతో ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదలకానుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు విజయ్ సేతుపతి , రవి కిషన్ ,సుధీప్, తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా తాజాగా హిందీ వెర్షన్ లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసింది తమన్నా.
కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంఫై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈచిత్రం యొక్క ట్రైలర్ ను ఈనెల 15న విడుదలచేయనున్నారని సమాచారం. మరి సాహో తరువాత దేశ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకానున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. సాహో ను ఓవర్సీస్ లో విడుదల చేసిన ఫార్స్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా అక్కడ విడుదలచేయనుంది.