రామ్ చరణ్ ‘సైరా’ కోసం 270 కోట్ల ఖర్చు అయింది అంటూ అనేక వ్యూహాత్మక లీకులు ఇప్పించినా కోరుకున్న ఫ్యాన్సీ రెట్లు ‘సైరా’ కు రాకపోవడంతో  చేసేదిలేక ఇప్పుడు చరణ్ మెట్టు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి  ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను 20 కోట్లకు అమ్మాలని చరణ్ చాల తీవ్రంగా ప్రయత్నించాడు. 

అయితే ‘సాహో’ ఎఫెక్ట్ తో ఈ డీల్ చివరకు 15 కోట్లకు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ‘సాహో’ ను విడుదల చేసిన సంస్థకే ‘సైరా’ ఓవర్సీస్ రేట్స్ ఇచ్చారు అని తెలుస్తోంది. వాస్తవానికి ఈమధ్య టాప్ హీరోలకు సంబంధించిన భారీ సినిమాలకు కూడ ఓవర్సీస్ లో కలక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. 

సమ్మర్ కు రిలీజ్ అయిన ‘మహర్షి’ మూవీతో పాటు లేటెస్ట్ గా ‘సాహో’ ను రిలీజ్ చేసిన ఓవర్సీస్  బయ్యర్ కు కూడ భారీ నష్టాలు వచ్చాయి. దీనితో టాప్ హీరోల సినిమాలకు కూడ ఓవర్సీస్ మార్కట్ లో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ కు 15 కోట్ల ఆఫర్ మించి రాదు అన్న వాస్తవాన్ని గ్రహించి రాజీ పడ్డాడు అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ మార్కెట్ కు సంబంధించి మరికొన్ని షాకింగ్ గాసిప్పులు బయటకు వస్తున్నాయి. ఈమూవీని తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా కర్ణాటక తమిళనాడు కేరళా ప్రాంతాలలో కూడ అత్యంత భారీ రేట్లకు అమ్మే ప్రయత్నాలు చేసాడు. అయితే ‘సాహో’ ఫలితంతో తెలుగు రాష్ట్రాల బయ్యర్లలో కూడ ‘సైరా’ సంబంధించి గుబులు ఏర్పడటంతో అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఈ మూవీ బయ్యర్లకు ధైర్యం చెపుతూ ఆఖరి నిముషంలో వారు బ్యాకౌట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ‘సైరా’ కూడ ఊహించిన విజయాన్ని అందుకోలేకపోతే  ఇక రానున్న రోజులలో టాప్ హీరోలకు సంబంధించిన భారీ సినిమాలు మార్కెట్ చేయడం చాల కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: