విద్యావేత్త ఆధ్యాత్మిక గురువు
గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అశువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి
పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం హరిద్వారకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి
పవన్ వెళ్ళినప్పుడు అక్కడ అతి సామాన్య వ్యక్తిగా ఎటువంటి సౌకర్యాలు లేని ఒక చిన్న గదిలో
పవన్ బస చేసిన ఫోటోలు ‘జనసేన’ వర్గాలు లీక్ చేయడంతో ఈ ఫోటోల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ ఎటువంటి సహాయకులు లేకుండా ఇలాంటి చిన్న గదిలో సౌకర్యాలు లేకుండా ఉండటం అతడి నిరాడంబరతను సూచిస్తోంది అంటూ పవన్ అభిమానులు ఈ ఫోటోల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు
హరిద్వార్ లో చాల విలాసవంతమైన కాటేజ్ లు ఉన్న పరిస్థితులలో
పవన్ కావాలి అనుకుంటే అలాంటి కాటేజ్ లలో ఉండవచ్చని అలా కాకుండా
పవన్ ఒక చిన్న గదిలో ఉండటం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అంటూ పవన్ వీరాభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ కామెంట్స్
పవన్ వ్యక్తిరేక వర్గానికి ఒక ఆయుధంగా మారాయి.
హరిద్వార్ లో
పవన్ అలా నిరాడంబరంగా ఉండటంలో విశేషం ఏముంది అంటూ ఆశ్రమాలలో నిరాడంబరంగా కాకుండా విలాసవంతంగా ఉంటారా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
అంతేకాదు పవన్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఈ ఫోటోలను బహిరంగంగా ఎందుకు లీక్ చేసారు అని ప్రశ్నలు వేస్తూ ఈ ఫోటోలద్వారా మరొకసారి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలని
పవన్ ఆలోచన అని అంటూ పవన్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు. పవన్ స్టార్ సెలెబ్రెటీ హోదాను కాకుండా సాధారణ వ్యక్తిగా జీవించాలి అంటే ఇంకా అనేక త్యాగాలు చేయవచ్చు అంటూ కూడ మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీనితో
పవన్ రాజకీయాలు మాత్రమే కాదు ఆశ్రమ జీవితం కూడ వివాదాస్పదంగా మారుతోంది..