Chammak Challo: తెలుగు ట్వీట్ రివ్యూ || Tweet Review || English Full Review

  ‘షో’, ‘మిస్మమ్మ’  వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ. ఈ అవార్డు చిత్రాల దర్శకుడు తెరకెక్కించిన కొత్త సినిమా ‘చమ్మక్ చల్లో’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సంగతేంటో చూద్దాం..! చిత్రకథ :     సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరికతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తాడు అవసరాల శ్రీనివాస్. ప్రేమకథతో సినిమా ను తీద్దామని నిర్మాత కోరడంతో మంచి కథ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అప్పారావు అగర్వాల్ [షియాజీ షిండే] అనే లెక్చరర్ తన విద్యార్థులైన శ్యామ్ [వరుణ్ సందేశ్], అను [కేథరిన్] ల ప్రేమకథ చెబుతాడు. అయితే వివాహం వరకూ వచ్చిన ఆ ప్రేమజంట తరువాత విడిపోయిందని తెలుసుకొని శ్రీనివాస్ ఆశ్చర్యపోతాడు. ఆ ప్రేమ జంట ఎందుకు విడిపోయింది... శ్రీనివాస్ వారిని ఎలా కలిపాడు... అనే విషయాలతో సినిమా సాగుతుంది.   నటీనటుల ప్రతిభ :   వరుణ్ సందేశ్ ఎప్పటి మాదిరిగానే నటించాడు. అతని నటనలో కొత్తదనం లేదు. సంచితా పడుకొనే ఆకట్టుకుంటుంది. చలాకీ అమ్మాయిగా తన ముఖంతోనే అనేక భావాలు పలికించింది. లిప్ లాక్ లకు, అవసరమైతే అందాల ప్రదర్శనకు కూడా సిద్ధపడింది. తెలుగు తెరకు ఒక మంచి హీరోయిన్ పరిచయం అయ్యిందని చెప్పుకోవాలి. గ్లామర్ పాత్రలో కేథరిన్ నటించింది. నిడివి తక్కువే అయినా గుర్తించుకునే పాత్రలో నటించింది. షయాజీ షిండే నటన కొత్తగా ఉంది. అతనిలో మంచి నటుడ్ని మరోసారి గుర్తు చేసింది. వినోదం పంచుతూ సాగిన అతని నటన కొత్త తరహాగా ఉంది. వరుణ్ సందేశ్ తండ్రిగా బ్రహ్మజీ అస్సలు సూట్ కాలేదు. మిగిలిన వారు పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ ఆకట్టుకోదు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే ‘సింపుల్ గా చెప్పాలా..’, ‘చందమామపై కుందేలా..’ పాటలు ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ కూడా బావుంది. మాటలు సో..సో.. గా సాగాయి. నిర్మాణ విలువలు సాధారణంగా ఉన్నాయి. సాధారణమైన ప్రేమకథను స్క్రీన్ ప్లే బలంతో నడిపించడానికి దర్శకుడు కృషి చేశాడు. దీనికి నటీనటులు ప్రతిభ కూడా తోడయ్యింది. నిజానికి స్రీన్ ప్లే విషయంలో నీలకంఠ చాలా బలవంతుడు. అతని గత చిత్రాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. అయితే నీలకంఠ ఈ సారి ప్రేమకథ ను ఎంచుకున్నాడు. ఈ కథ సాధారణమైనది కావడంతో చిత్రాన్ని స్ర్ర్ర్కీన్ ప్లే  కాపాడలేక పోయింది. పైగా బోర్ కొట్టిస్తుంది.     హైలెట్స్ :     సంచిత పడుకొనే నటన, కేథరిన్ గ్లామర్ ,  షియాజీ షిండే కొత్త తరహా నటన డ్రాబ్యాక్స్ :     వైవిధ్యంలేని కథ, బోర్ గా సాగే స్ర్కీన్ ప్లే, ఫోటోగ్రఫీ విశ్లేషణ :  కేవలం రెండు పాత్రలతో ‘షో’ అనే సినిమా తో తన సత్తా చూపించిన నీలకంఠ తరవాత ‘మిస్సమ్మ’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద విజయాన్ని కూడా నమోదు చేసుకున్నాడు. తరువాత అతని సినిమాలు ఆశించిన విజయాన్ని పొందలేక పోతున్నా ఇటీవల వచ్చిన ‘విరోధి’ సినిమా కూడా అతనిలో విషయం ఉందనే సంగతి నిరూపించింది. అయితే కమర్షియల్ సక్సెస్ కోసం ఈ సారి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నీలకంఠ. [ప్రేమకథలతో సులువుగా హిట్ కొట్టవచ్చని ఈ సినిమాలో నిర్మాత పాత్రతో ఒక డైలాగ్ కూడా ఉంది]. కానీ, ఈ చిత్రంతో ప్రేమకథలతో విజయం సాధించడం అంత ఈజీ కాదని నీలకంఠ తెలుసుకుంటాడు. విజయం కోసం ప్రేమకథతో రాజీపడిన ఈ దర్శకుడు ఇప్పుడు తన స్క్రీన్ ప్లే మాయాజలాన్ని కూడా పొగొట్టుకుని, రెండిటినీ [ విజయాన్ని, పేరును ] నిలబెట్టుకోలేకపోయాడు.   చివరగా :     ‘చమ్మక్ చల్లో..’ : టైటిల్ లో జోష్  చిత్రంలో లేదు.

Chammak Challo Review: Cast & Crew

   

More Articles on Chammak Challo || Chammak Challo Wallpapers || Chammak Challo Videos


    

మరింత సమాచారం తెలుసుకోండి: