తెలుగు ఇండస్ట్రీలో ‘సీతాకోక చిలుక’ సినిమాతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆలీ..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు. ఏ హీరో పక్కన వేసినా తన క్యారెక్టర్ పరంగా కడుపుబ్బా నవ్వించగల ఆలీ ఈ మద్య బుల్లితెరపై యాంకర్ అవతారమెత్తాడు..అంతే కాదు సినిమా ఈవెంట్స్ కి కూడా వ్యాఖ్యాత గా వ్వవహరిస్తున్నాడు. ఇక సినిమాలో సీనియర్ హాస్యనటుడిగా మంచి పేరు ఉన్నా..ఇప్పుడు ఆలీ అంటే యాంకర్లు, కొంత మంది హీరోయిన్లు చిర్రెత్తిపోతున్నారు.

సినిమా ఆడియో ఫంక్షన్లలో సెలబ్రెటీలు ఉంటారు..చాలామంది అభిమానులు ఉంటారు. ఇక వ్యాఖ్యాతగా ఉన్నావారు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది..కానీ ఈమద్య ఆలీ తన కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబల్ మీనింగ్ మాటలు అటు యాంకర్లను ఇబ్బంది పెడుతూ..ఇటు హీరోయిన్ల మనసు నొప్పిస్తు ఉన్నాయి. ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు..అప్పుడు నవ్వుకోవడానికి బాగున్నా తర్వాత వాటిపై వచ్చే విమర్శలు చూసి యాంకర్లు, హీరోయిన్లు మానసికంగా భాదపడ్డట్టు తెలుస్తుంది.

అంతే కాదు కొంత మంది సీరియస్ వార్నింగ్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక దశలో సుమ ఆడియో ఫంక్షన్లో ఆలీ ఉంటే నేను రాను అన్నట్టుగా సమాచారం.. ఇది ఎంత వరకు నిజమో..? కాదో కానీ ఆలీ చేస్తున్న పిచ్చి చేష్టలు ఏ ఆడవారికైనా ఇబ్బందే..   తాజాగా ఆలీ మరోసారి తన నోటిదురదను ప్రదర్శించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలలో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’ చిత్రం ఆడియో ఫంక్షన్లో నడుంపై, తొడలపై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు.


ఆలీ కామెంట్స్ చేసిన సెలబ్రెటీలు


ఈ తండ్రికొడుకులు(రాఘవేంద్రరావు-ప్రకాష్) ఏంటోగానీ... నడుము మాత్రం వదలట్లేదు. ఆయన నడుం వదల్లేదు.. కొడుకు నడుంవదల్లేదు. ఆయన ప్రపంచంలోని వున్న పండ్లు అన్నిటితో కొట్టేసాడు. ప్రకాష్ ఇపుడు జిలేబితో కొడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అనుష్క తొడలపై కూడా కామెంట్ చేశాడు..ఆ సమయంలో అక్కడున్నవాళ్లంతా నవ్వారు వారితోపాటే అనుష్క కూడా నవ్వింది కానీ ఇలాంటి పిచ్చి కామెంట్లతో తన పరువు తీశాడే..అని లోలోపల చాలా బాధపడినట్లు సన్నిహితులు తెలిపారు. ఏది ఏమైనా ఆడవాళ్లు అందునా సెలబ్రెటీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే ప్రచారంలోకి వచ్చి వారి ఇమేజ్ డ్యామేజ్ అవతుందుని ఆలీ ఎప్పుడు గ్రహిస్తాడో..


మరింత సమాచారం తెలుసుకోండి: