తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న తనంలో ‘బూచాడమ్మా బూచాడు..బుల్లి పెట్టెలో ఉన్నాడు’ అంటూ పాటతో అందరినీ ఇట్టే కట్టిపడేసిన చిన్న పాప..పెరిగి పెద్దదై పదహారేళ్ల వయసులో ‘సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా చిన్నారి చిలకమ్మా’ అనే పాటతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా..ఆమె ఎవరో కాదు అతిలోక సుందరిగా పిలిపించుకున్న శ్రీదేవి. ఎనభైవ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి తర్వాత వారి తరం కర్రాలు వెంకి, నాగార్జున లతో కూడా నటించి అదే గ్లామర్ మెయింటేన్ చేసింది...అందుకే శ్రీదేవిని ఎవర్ గ్రీన్ అందగత్తెగా పిలుస్తారు.


తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన శ్రీదేవి కొంత కాలం తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది..అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ని వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు  పెద్ద కూతురి పేరు జాహ్నవి , చిన్న కూతురి పేరు ఖుషి కపూర్. అయితే ఆ మద్య పెద్ద కూతురు జాహ్నివిని హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఏ సినిమాలో ఖరారు కాలేదు.

కుటుంబంతో శ్రీదేవి


ఇక చిన్న కూతురు విషయానికి వస్తే ఈ అమ్మడు చాలా ఫాస్ట్.. ఆ  మధ్య అమెరికన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ జాక్ గిలిన్ స్కైని ముద్దు పెట్టుకొని వార్తల్లో నిలిచింది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అమ్మడు మరింత అందంగా కనిపించేందేకు సర్జరీ కూడా చేయించుకుందని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఖుషీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట..అందుకే ఇప్పటి నుంచి పాపులర్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: