రానా ప్రస్థుతం ‘బాహుబలి 2’ లో నటిస్తూనే తమిళంలో తీస్తున్న ‘బెంగుళూర్ డేస్’ తమిళ వర్షన్ లో నటిస్తున్నాడు. దీనితో పాటు రానా బాలీవుడ్ లో నటిస్తున్న ‘ఘాజి’ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో తీస్తున్న వార్ సినిమా ఇది. దీనికోసం ఒక ప్రత్యేకమైన సబ్ మెరైన్ సెట్ వేసి సముద్రపు అలల ఎఫట్స్ వచ్చేలా ఈసినిమాను షూట్ చేస్తున్నారు. 

ఈవార్తలు ఇలా ఉండగా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ఒక లేటెస్ట్ ఫ్లాష్ ను బయట పెట్టాడు. తన మొదటి సినిమా ‘లీడర్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయాన్ని తెలియచేసాడు రానా. ‘లీడర్’ సినిమాలో ఉన్న పాత్రలు అన్నీ ఈ సీక్వెల్ లో కూడ కొనసాగుతాయి అని చెపుతూ నటీనటులు మాత్రం కొంతమంది మారుతారు అని అంటున్నాడు రానా. 

తాను 2010 లో ‘లీడర్’ సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఎలా నటిస్తున్నానో తెలియక కొంత అయోమయంలో నటించిన విషయం వాస్తవం అని అంటూ ఇప్పుడు ‘లీడర్ 2’ లో తాను నటించబోతున్న పాత్ర ప్రస్తుత వాస్తవ పరిస్థుతులకు బాగా దగ్గరగా తన మైండ్ సెట్ కు కూడ బాగా దగ్గరగా ఉండే పాత్రను ఎంచుకున్నాను అని అంటున్నాడు రానా. 

అయితే ‘బాహుబలి 2’ షూటింగ్ కు ఏ మాత్రం అడ్డు లేకుండా ఈ సీక్వెల్ నిర్మాణం ఉంటుంది అని అంటూ అన్నీ అనుకూలిస్తే ఈ సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేస్తాను అని అంటున్నాడు ఈ భల్లాలదేవా. అయితే ఇన్ని విషయాలు చెప్పిన రానా ఈ సీక్వెల్ ను ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న విషయం పై స్పష్టత ఇవ్వక పోవడంతో ఈ మూవీ ఇంకా రానా డ్రీమ్ ప్రాజెక్ట్ గానే ఉండిపోయిందా అని అనిపించక మానదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: