తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం నిన్న విడుదలైంది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తుంది. అయితే సినిమాలో పవర్ స్టార్ మాత్రం వన్ మెన్ షో చేసినట్లు అన్నీ తానై నటించినట్లు పబ్లిక్ టాక్..ఏది ఏమైనా ఈ చిత్రంలో పవన్ ఓ మాస్ హీరో గా అద్భుతమైన పర్ఫామెన్స్ చేసినట్లు అభిమానులు చెబుతున్నారు. ఇక పవన్ తో సినిమా అంటే ఎవరికైనా చాలా అదృష్టం ఉండాలంటారు..ఆయన పక్కన నటిస్తే అంతకన్నా గొప్ప చాన్స్ వేరే లేదని భావించే వారు చాలా మంది ఉన్నారు. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో గ్లామర్ బ్యూటీ సంజన నటించిందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది.

సర్ధార్ గబ్బర్ సింగ్ లో శరద్ కేల్కర్, సంజనా

'

ఇక నిన్న సినిమా విడుదలైతే కానీ తెలియలేదు..ఈ అమ్మడు అసలు క్యారెక్టర్ ఏమిటో. ఎంతో గొప్పలు చెప్పుకుంటూ పవన్ పక్కన చోటు దొరికిందని చెప్పిన సంజన విలన్ అయిన  శరద్ కేల్కర్ భార్యగా నటించింది. అంతే కాదు ఈ పాత్రకు పెద్ద స్కోప్ కూడా లేదు..అప్పుడప్పుడు కనిపించే పాత్రమాత్రమే..అంతే కాదు పెద్దగా డైలాగులు కూడా లేని పాత్రం. సర్ధార్ గబ్బర్ సింగ్ లో చాన్స్ దొరకడం అంటే తన అదృష్టంగా భావిస్తూన్నా అంటు వచ్చింది సంజన..  కట్ చేస్తే సినిమాలో ఈ భామ కనిపించిన సన్నివేశాలు తక్కువే ! అందునా ఈమెని గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో అసలు సంజన ఈ సినిమాలో ఉందన్న విషయమే మర్చిపోయారు.

సంజన హాట్ లుక్స్


ఎంతో గ్లామర్ ప్రాధాన్యత గల పాత్రలు వేసుకుంటూ వచ్చిన సంజన చాలా సింపుల్ గా చీరకట్టు తో కనిపించింది. గతంలో ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లెలుగా మంచి గ్లామర్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాలు ఏవీ రాలేదు...అప్పుడప్పుడు టివి షో లో కనిపిస్తూ..కనువిందు చేస్తుంది. అయితే పవన్ కళ్యాన్ నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా అనగానే ఎగిరి గంతేసిన ఈ అమ్మడికి ఈ చిత్రంలో ఏమీ పేరు రాకపోవడంతో డీలా పడింది..పాపం సంజన. 


మరింత సమాచారం తెలుసుకోండి: