పవన్ కళ్యాణ్ తోటి హీరోలను టార్గెట్ చేస్తూ ఎప్పుడూ కామెంట్ చేయడు. అలాంటిది  తెలుగు సినిమాల్లో తెలంగాణ పదాలు, పద్యాలు, జానపదాలకు చోటు కల్పించి వాటికి ప్రచారం కల్పించిన ఏకైక హీరో తానొక్కడినే  అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చేసిన కామెంట్స్ చాలా వ్యూహాత్మకంగా చేసాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. తాను అతి త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్న నేపధ్యంలో తనకు మంచి పట్టు ఉన్న తెలంగాణా ప్రజలను కుడా దృష్టిలో పెట్టుకుని పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి. 

ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే పవన్ తెలంగాణా సంస్కృతి  పై తన అభిమానం గురించి మాట్లాడుతూ పవన్ దశాబ్దం కిందట వచ్చిన ‘జానీ’ సినిమాలోనే తెలంగాణ జానపదాలు వినిపించానని ఇంకా అదేవిధంగా  తన ప్రతి సినిమాలోనూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అంశాలకు చోటిచ్చానని పవన్ చెప్పాడు. ఈ విషయంలో తనకు ఆయా సినిమాల యూనిట్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదని పవన్ చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  ప్రాంతాల మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అన్న విషయం తాను ఎప్పుడో అర్థం చేసుకున్న విషయం ప్రస్తావిస్తూ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణా సంస్కృతికి  రిప్రెజెంటేషన్ ఉండేది కాదు అని అందుకే తన సినిమాల్లో అక్కడి జానపదాలకు పాటలకు మాటలకు ప్రాతినిధ్యం కల్పించాను అంటూ కామెంట్ చేసాడు. అయితే తానూ ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు  కొంతమంది ఇలాంటివి పెడితే ఆంధ్రావాళ్లకు కనెక్ట్ అవ్వవు అని తనను కామెంట్ చేసిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు.  

మనం వేరే భాషల సినిమాలు చూస్తున్నుడు తెలంగాణా సంస్కృతి ఎందుకు చూడలేము అని సంచలన కామెంట్స్ చేసాడు పవన్. అంతేకాదు కళ అనేది కల్చరల్ బ్రిడ్జ్ లాంటిది. జనాల మధ్య వారధిగా నిలవాలికాని జనాల మధ్య గ్యాప్ పెంచకూడదు అని అభిప్రయపడ్డాడు పవన్. అందుకే తానూ  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న కల్చరల్ గ్యాప్ ను పూడ్చాలని అనుకుకుంటున్నాను అంటూ పవన్ తాను ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అందరివాడిని అన్న సంకేతాలు ఇచ్చాడు పవన్. పవన్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలను చూస్తూ ఉంటే చాల వ్యుహత్మకంగా ముందు చూపుతో అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: