ఫిలింనగర్ లో వినిపించే గాసిప్పులు ఒకొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆ న్యూస్ నిజమేనేమో అని అనిపించే డట్లుగా భావన కలిగిస్తుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రమోషన్ నిమిత్తం మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ తన స్టాప్ కు జీతాలు ఇవ్వలేని స్థితిలో తాను ఉన్నానని చెప్పడం వల్ల పవన్ పై ఎంత సానుభూతి వచ్చిందో తెలియదు కాని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కుని నష్టపోయిన బయ్యర్ల కోపాన్ని మాత్రం చల్లార్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను కొనుక్కున్న బయ్యర్లకు వివిధ ప్రాంతాలలో కనీసం 40 శాతం నుంచి 50 శాతం వరకు నష్టాలు వస్తాయని టాక్. అయితే ఈ నష్టాలను పూడ్చమని ఆవేశంగా పవన్ అభ్యర్ధించాలి అని నిర్ణయించుకున్న ‘సర్దార్’ బయ్యర్లకు పవన్ ఇంటర్వ్యూలో తన ఆర్ధిక స్థితి గురించి చెప్పిన మాటలు పవన్ పై బయ్యర్లకు వచ్చిన కోపాన్ని చాల వరకు తగ్గించింది అని ఫిలింనగర్ టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో నటించ బోతున్న ‘హుషారు’ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో నిర్మించి ఆ సినిమా రైట్స్ ను ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు తక్కువ రేట్లకు ఈ సినిమా ఏరియా రైట్స్ ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ కూడ ప్రస్తుతానికి ‘సర్దార్’ బయ్యర్ల కోపాన్ని చాల వరకు తగ్గించినట్లు టాక్. 

పవన్ లేటెస్ట్ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను తన వల్ల నష్టపోయిన బయ్యర్లకు వేగంగా నిర్మించి ఇచ్చి వేసి వెనువెంటనే ఈ సంవత్సరాంతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పట్టాలు ఎక్కించి వచ్చే సంవత్సరం మధ్యలో తాను దాసరికి ఇచ్చిన మాట ప్రకారం మరో సినిమాను తీయలనే ఆలోచనలో పవన్ ఉన్నాడు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా పవన్ వ్యూహాత్మకంగా చెప్పకపోయినా పవన్ తన ఆర్ధిక స్థితి గురించి చెప్పిన మాటలు పవన్ కు కలిసి  వచ్చినట్లే కనిపిస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: