దర్శకుడు పూరి జగన్నాథ్ కి 'లోఫర్' మూవీ  డిస్ట్రిబ్యూటర్లకి  మధ్య వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతున్న నేపధ్యంలో ఆ  డిస్ట్రిబ్యూటర్లకి మద్దతుగా నిలిచేందుకు ప్రముఖ దర్శకుడు  దాసరి నారాయణరావు రంగంలోకి దిగినట్లుగా  వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ రోజు దాసరి 'లోఫర్' డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి . 

ఈ  వార్తల పై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేక పోయినా దాసరి ఈ ప్రెస్ మీట్ లో ఏమి మాట్లాడుతాడు అన్న ఆసక్తి అందరిలోను పెరిగి పోతోంది లోఫర్ విషయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చాలని డిస్ట్రిబ్యూటర్లు ఆ చిత్ర నిర్మాతని అదేవిధంగా దర్శకుడుని  కోరినా వారు ఎటూ తేల్చని నేపధ్యంలో  ఆ  డిస్ట్రిబ్యూటర్ లు  అంతా సినీ పరిశ్రమకి పెద్దన్నలాంటి దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళినట్లు టాక్. 

ఆ డిస్ట్రిబ్యూట ర్ ల వాదనని విని మద్దతుగా నిలిచేందుకు దాసరి  ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో . పూరికీ, దాసరి నారాయణరావుకు  మధ్య సరైన ఈక్వేషన్స్ లేవన్న ప్రచారం కూడా సాగుతున్న నేపధ్యంలో దాసరి ఈ ప్రెస్ మీట్ లో ఏమి మాట్లాడుతారు అన్న ఆసక్తి ఉంది.

 ఈ వార్తలు ఇలా ఉండగా  తన పై ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారని స డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఆరోపణలను  డిస్ట్రిబ్యూటర్లు  ఖండించారు. అసలు తాము మూడు నెలలుగా ఆయనను కాంటాక్ట్ చేయనేలేదని ఈ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు పూరీకి ఎంతో సెక్యూరిటీ ఉంటుందని, ఆయన ఇంట్లోనూ, ఆఫీసులోనూ సీసీ కెమెరాలు కూడా వుంటాయని అందువల్ల ఆ కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఈ డిస్ట్రిబ్యూటర్ ల వాదన . ఇలా రకరకాల ట్విస్ట్ లతో జరుతున్న ఈ వ్యవహారంలో ఈ రోజు ఏమి ట్విస్టులు వస్తాయి అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: