తెలుగు బుల్లి తెరపై అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్ధస్త్. ఈటీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ బుల్లితెరపై తీసుకు వచ్చింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఆకర్షించింది బజర్దస్త్ కామెడీ షో. ఈ ప్రోగ్రామ్ తో ఎంతో మంది ఔత్సాహిక నటులు మంచి సెలబ్రెటీలుగా మారిపోయారు. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ తో అందమైన హాట్ యాంకర్లు అనసూయ,రేష్మి ఇటు బుల్లి తెరపై..అటు వెండి తెరపై హాట్ టాపిక్ గా మారారు. అంతే కాదు టాలీవుడ్ లో మంచి కమెడియన్లుగా వేణు,ధన్ రాజ్, శకలక శంకర్,చమ్మక్ చంద్ర లాంటి వారు మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే గత కొంత కాలంగా  బజర్దస్త్ కామెడీ షో లో నీలి నీడలు వెంటాడుతున్నాయి.

 ‘జబర్ధస్త్’ కామెడీ షో మేనేజర్ ఏడుకొండలు


గతంలో వేణు ఒక కులం వారిని కించపరిచారని కొట్టారు. ఓ యాంకర్ తనను శారీరకంగా వాడుకొని డబ్బులివ్వలేదని చమ్మక్ చంద్రపై కాంప్లెంట్ చేసింది..తర్వాత ఇరు వర్గాలు సెటిల్ మెంట్ చేసుకున్నాయి. ఇక  బజర్దస్త్ కామెడీ షో మేనేజర్ ఏడుకొండలు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చారు. తర్వాత జడ్జీగా వ్యవహరిస్తున్న రోజా కూడా  బజర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత శకలక శంకర్ పై కూడా కొన్ని రూమర్లు వచ్చాయి.  బజర్దస్త్ కామెడీ షో రోజుకో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా  'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే..' జ‌బ‌ర్ధ‌స్త్ లో ఒకస్కిట్ లో న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు, భ‌గ‌వ‌త్ గీతను కించ‌ప‌రిచార‌ని ఆఫిర్యాదులో పేర్కొన్నారు.

చమ్మక్ చంద్ర,స్వాతినాయుడు


ఫిర్యాదు స్వీకరించి పరిశీలించిన న్యాయ‌మూర్తి జ‌బ‌ర్ధ‌స్త్ టీం యాంక‌ర్లు అన‌సూయ‌, ర‌ష్మి, ప్రోగ్రామ్ జడ్జీ లు నాగేంద్ర‌బాబు, ఎమ్మెల్యే రోజా, ప్రోగ్రాం ప్రొడ్యూస‌ర్ శాంసుందర్ రెడ్డి తో పాటు క‌మెడియ‌న్లు ఫ‌ణి, ధ‌న్ రాజ్ లకు నోటీసులు జారీచేశారు.ఆ స్కిట్ లో పాల్గొన్న నటులనూ, నిర్వాహకులనూ,జడ్జీలనూ,యాంకర్ నూ హాజరు కావాల్సిందిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది అదే కేసు విశయం లో జబర్దస్త్ ఆర్టిస్టులంతా హుజూరూరాబాద్ కోర్టు లో హాజరయ్యారు.



 హాజరైన వారిలో పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్ రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: