తెలుగు ఇండస్ట్రీలో 80 వ దశకంలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయి..తర్వాత లేడీ ఓరియెంటెండ్ పాత్రలతో ఆకట్టుకొని లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. తెలుగు అగ్ర హీరోల సరసన నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తర్వాత రాజకీయాల్లోకి వెళ్లింది.  ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమయంలో  తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన ఆమె తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీ వీడిపోయింది.

కేసీఆర్ తో విజయశాంతి


తర్వాత  కాంగ్రెస్ పార్టీలోకి  వెళ్లి ఎన్నికల బరిలో ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయశాంతి కనపడకుండా పోయింది. అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూన్న విజయశాంతి ఇప్పుడు మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశభక్తికి సంబంధించి ఓ సినిమా స్టోరీ కూడా రెడీ అయ్యిందట ఆమె కోసం.

ఒసేయ్ రాములమ్మ చిత్రంలో విజయశాంతి


గతంలో దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఓసేయ్ రాములమ్మ’ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ తో ఇప్పుడు మరోసారి రీ ఎంట్రీ ఉంటుందని కూడా తెలుస్తోంది.  ఏదేమైనా  నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా ఈ సినిమాతో అందుకున్న విజయశాంతి ఇప్పుడు మళ్లీ అదే సినిమా సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: