తెలుగు ఇండస్ట్రీలో పరాయి భాష నుంచి వచ్చిన హీరోయిన్ల కు చాలా తక్కువ మంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు..అలాంటి వారిలో మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు. నాని హీరోగా  "అలా మొదలైంది" చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళీ చిత్రాల్లో బిజీగా ఉన్న నిత్యా మీనన్ బాల నటి అని చాలా మందికి తెలియిదు.

తాజాగా ఈ అమ్మడు బాలనటిగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ప్రస్తుతం జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ సూర్య సైన్స్ ఫిక్షన్ మూవీ 24లోను నటించింది. ఆ మద్య లారెన్స్ గంగ చిత్రంలో సెకండ్ ఆఫ్ మొత్తం నిత్యా మీనన్ అంగవైకల్యంతో అద్భుతంగా నటించి మెప్పించింది. నిత్యా పదేళ్ళ వయస్సులో వచ్చిన మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఇంగ్లీష్ చిత్రంలో టబు చెల్లెలిగా నటించింది నిత్యా. ఈ చిత్రం 1988 లో విడుదల అయ్యింది..తరువాత ఈ చిత్రాన్ని మళియాలంలో అనువదించారు. చిన్నతనంలో నిత్యామీనన్ ఎంత అందంగా కనిపిస్తుందో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: