‘బ్రహ్మోత్సవం’  సినిమాను ప్రమోట్ చేస్తూ సమంత మహేష్ భార్య నమ్రతకు ఊహించని షాక్ ఇచ్చింది. ‘దూకుడు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాల తరువాత మహేష్ తో ముచ్చటగా మూడవసారి నటిస్తున్న సమంత మహేష్ పై తన తీరని కోరికను వ్యక్త పరిచింది. గతంలో తాను రెండు సార్లు మహేష్ తో నటించినా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోనటిస్తున్నప్పుడు మహేష్ బాబు అందం చూసి తాను ఫ్లాట్ అయిపోవడమే కాకుండా మహేష్ ను ఘాడంగా ముద్దుపెట్టుకుందామని అనిపించింది అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది సమంత. 

తాను  ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోని ఒక పాట కోసం షూటింగ్ లో ఉన్నప్పుడు తనకు ఈ కోరిక కలిగింది అని అంటూ అయితే తాను ఇట్ల ప్రవర్తిస్తే యూనిట్ సభ్యులు ముఖ్యoగా నమ్రత ఎమనుకుంటుందో అని భయపడి ఆ ప్రయత్నం మానుకున్నాను అంటోంది సమంత. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో తన పాత్రకు పేరు లేదు అని అంటూ మరో షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. 

అయితే ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల సినిమాలో మనకు సంబంధించిన పాత్రలనే చూసిన ప్రేక్షకులు తొలిసారి ఈ సినిమాలో కథ రీత్యా ఎన్నారై పాత్రల్ని చూడబోతున్నారు. విదేశాల నుంచి వచ్చిన భామలుగా సమంత కాజల్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే సమంత తాను పేరుకే ఎన్నారై అమ్మాయిని  కానీ అచ్చంగా మన తెలుగింటి అమ్మాయిల్లాగే కనిపిస్తామని చెపుతోంది. శ్రీకాంత్ అడ్డాల సినిమాలో బాబాయ్ లు, మావయ్యలు, అత్తయ్యలు, కోడళ్లు, మరదళ్లు ఉంటారు తప్ప పేర్లు వుండవని  అందుకే తన పాత్రకు కూడ పేరు లేదు అంటూ తన పై తానే సెటైర్ వేసుకుంది సమంత. 

అయితే మరో హీరోయిన్ కాజల్ పాత్ర పేరు మాత్రం కాశీ అని చెపుతోంది  ఈమాయ లేడి. అయితే కాశీ పేరు పెట్టికున్న కాజల్ ఎందుకు ఇంత గ్లామర్ గా కనిపిస్తోంది అన్నది సినిమా చూస్తే కాని తెలియదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: