చట్టముందు అందరూ సమానమే..ఈ విషయంలో చిన్నా పెద్దా లేదని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఇక సినీ సెలబ్రెటీల విషయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఆ మద్య హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కార్ నెంబర్ బోర్డు కేసులో 700 రూపాలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు..తర్వాత తారకరత్న విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అంతే కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా సెలబ్రెటీలను వదిలిపెట్టలేదు పోలీసులు. తాజాగా ఇలాంటి సంఘటనే నోయిడాలో ఓ స్టార్ హీరోయిన్ విషయంలో జరిగింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ అదితి రావు హైదరీ   నోయిడాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్తుంది..అయితే అప్పటికే సమయం గడిచిపోవడంతో త్వరగా వెళ్లాలని  తన కార్ డ్రైవర్ షాట్ కట్ అని రాంగ్ రూట్ లో వెళ్ళమని చెప్పింది..దీంతో ఆ డ్రైవర్ షాక్ కట్ లో వెళ్తున్నాడు ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ధర్మేంద్ర యాదవ్ ఆ కారు ను వెంబడించి డ్రైవర్ ని ఆపాడు.

అదితి రావు హైదరీ


అంతే కాదు రాంగ్ రూట్ లో వెళ్తున్నావని హెచ్చరించాడు..అయితే కారులో ఉన్నది ప్రముఖ హీరోయిన్ అని తెలిసింది..కానీ మనోడు అదేం లేక్కచేయకుండా చట్టం అందరి దృష్టిలో సమానమే అని ఫైన్ వేశాడు. ఇక ట్రాఫిక్ పోలీస్ తో గొడవపెట్టుకుంటే తన పరువే పోతుందని భావించిన అదితి కామ్ గా రోడ్డుపై నడుచుకుంటూ మాల్ కి వెళ్లిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: