ఈమధ్య ‘అ ఆ’ సినిమాను చూస్తూ కెమెరాలకు దొరికి పోయిన నాగచైతన్య సమంతలు ఆ తరువాత ఒక షాపింగ్ మాల్ లో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా మీడియా కంట పడకుండా మేనేజ్ చేస్తున్న ఈ ప్రేమ పక్షులు కలిసి ఒక అపార్ట్ మెంట్ బాల్కనీలో కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం వెబ్ మీడియాలో హడావిడి చేస్తోంది.

అయితే ఈ వీడియోను ఎవరూ ఎక్కడ ఎలా క్యాచ్ చేసారు అనే విషయం పై క్లారిటీ లేకపోయినా చైతూ సమంతల లమధ్య ప్రేమ రోజురోజుకు మరింత బలపడిపోతోంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ విషయం చెప్పుకోవచ్చు. వీరిద్దరి స్పీడ్ చూస్తూ ఉంటే ఈ సంవత్సరాంతం లోపే వీరి పెళ్ళి వ్యవహారానికి శుభం కార్డు పడే ఆస్కారం ఉంది అని అనిపించడం సహజం.

అందుకే నాగార్జునకు టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతోంది అని అంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు రోజుకు ఒక ట్విస్ట్ తీసుకుంటున్న నేపధ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో నాగచైతన్య సినిమాల గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. కేవలం వీరిద్దరి పెళ్ళి ఎప్పుడూ అన్నమాటలు మాత్రమే ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. 

కొద్ది రోజుల క్రితం జరిగిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో ఫంక్షన్ ను కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు కూడ ఆసినిమా వార్తల కంటే సమంత చైతూల ప్రేమ గాసిప్పులు గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు అంటే వీరి ఇద్దరి ప్రస్తుత పరిస్థితి టాలీవుడ్ ను ఎలా షేక్ చేస్తోందో అర్ధం అవుతోంది.. 

ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: