‘అష్టాచెమ్మా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ నటించిన సినిమాలు చాల కొద్దిపాటి సంఖ్యలో మాత్రమే ఉన్నా తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం అవసరాల సుపరిచితమైన నటుడిగా మారిపోయాడు. ఈమధ్య కాలంలో వెరైటీ పాత్రలకు అవసరాలను చాలమంది దర్శకులు ఎంపిక చేస్తున్నారు. దర్శకుడిగా నటుడుగా ఇలా రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తూ కూడ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు అవసరాల. 

ఇటువంటి విలక్షణ నటుడు లేటెస్ట్ గా ఒక అడల్ట్ కామెడీ మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను చూసిన చాలామంది అవసరాల నిర్ణయాన్ని తప్పు పట్టారు కూడ. అయితే ఈ కామెంట్స్ అవసరాల దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి. దీనితో ఈ విలక్షణ నటుడు ఈ విషయం పై చాల విలక్షణంగా స్పందించాడు అని వార్తలు వస్తున్నాయి. 

తాను అమెరికాలో 'యాక్టింగ్ స్కూల్ లో ఉన్నపుడు చాలా బూతు సీన్లను స్టేజ్ పై లైవ్ లో చేశాను అని అంటూ వాటిని వందలసార్లు రిహార్సల్స్ చేయవలసి వచ్చిందని వాటితో పోల్చుకుంటే తాను చేయబోయే అడల్ట్ కామెడీ లోని తన పాత్ర చాల చిన్నది అని కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మూవీ ‘హంటర్’ ని తెలుగులో అడల్ట్ కామెడీగా రీమేక్ చేస్తున్నారు. బాగా చదువుకున్న ఒక సెక్స్ అడిక్ట్ కథ ఈ సినిమా పై విమర్శకుల ప్రశంసలు కూడ వచ్చాయి. 

ఈ సినిమాలోని హీరో పాత్ర తనకు బాగా నచ్చడంతో ఈ అడల్ట్ కామెడీని చేస్తున్నాను అని అంటున్నాడు అవసరాల. ఈ హంటర్ రీమేక్ లో మెయిన్ హీరోయిన్ గా రెజీనా, రాశి ఖన్నాలను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడ ఈ అడల్ట్ కామెడీలో నటించడానికి ఒకే చెప్పినట్లు టాక్. ఇప్పటికే బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ సినిమాల హవా జోరుగా ఊపు అందుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ కల్చర్ టాలీవుడ్ సినిమా రంగానికి కూడ తాకుతూ ఉండటంతో యూత్ అభిరుచులలో మరిన్ని మార్పులు చోటు చేసుకుని మరింత గందరిగోళ పరిస్థుతులు ఏర్పడే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: