సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీస్తే అది చిన్న సినిమా కావచ్చు..పెద్ద సినిమా కావొచ్చు హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి దక్కుతుంది. కానీ ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడిపైనే ప్రభావం పడుతుంది. ఎందుకంటే దర్శకుడు చెప్పినట్లు హీరో నటిస్తాడు..అయితే ఆ దర్శకుడినే కథా కథనం పట్ల అవగాహన లేకుండా చిత్రానికి దర్శకత్వం ఎలా వహిస్తాడు అన్న విమర్శలు తలెత్తుతాయి. ఈ విధంగా సక్సెస్ బాటలో నడిచిన దర్శకులకు కూడా ఒక్కోసారి వరుస ఫెయిల్యూర్ చిత్రాలు వస్తే ఆ దర్శకుడిపై విపరీతమైన విమర్శలు రావడం సహజం. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడిని ఆయన అభిమానులు బండబూతులు తిడుతున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేసే చాన్స్ వస్తే రికార్డులు బద్దలయ్యేలా సినిమా తీస్తారని భావించిన అభిమానులు ఈ చిత్రం స్లో నెరేషన్ తో ప్రేక్షకులు నీరస పడిపోయేలా చేసిన దర్శకులు పా . రంజిత్ పై రజనీ అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇక రజినీ స్టైల్ డైలాగ్స్ ఏమాత్రం చూపించలేదని ఎప్పటకి గ్యాంగ్ వార్ కి సంబంధించిన సీన్లే ఎక్కువ ఉన్నాయని అంతే కాకుండా వైలెన్స్ కూడా బాగా ఉందని అంటున్నారు.  రజినీ కాంత్ అంటే మాస్ ఎంట్రటైన్ మెంట్ ఎక్కువగా ఉంటుందని భావించే సగటు ప్రేక్షకులకు ఈ చిత్రం ఏమాత్రం రుచించదు.

అయితే రిలీజ్ అయిన తర్వాత కబాలి చిత్రాన్ని చూసి రజనీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా పా రంజిత్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు . ఈనెల 22న రిలీజ్ అయిన కబాలి రజనీ మేనియా తో భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ డివైడ్ టాక్ తో రన్ అవుతోంది .  అయితే కబాలి చిత్రం తీసే సమయంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు రావడంతో పా. రంజీత్ తో చాలా మంది హీరోలు సినిమాలు తీయానే ఆలోచనలో ఉన్నారట..మరి ఈ రిజల్ట్ చూసిన తర్వాత వారి ఎలా ఆలోచిస్తారో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: