తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్  కబాలి చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో సంచలన కథనాలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు కూడా ఎన్నో సంచలనాలు సృష్టించింది..రిలీజ్ కు ముందే నెట్లో దర్శనం ఇచ్చిందని ఆ చిత్ర నిర్మాత మద్రాస్ కోర్టును ఆశ్రయించారు.  మొత్తానికి ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల అయ్యింది.   ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా రజినీకాంత్ పై ఓ యువకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తికి రేకెత్తించారు.

 అయితే ‘కబాలి’ సినిమా చూసి తాను మోసపోయానంటూ చెన్నైలోని వడపళనికి చెందిన కందస్వామి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 66 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ అయిన రజనీకాంత్‌ చేత ఆ వయసులో కూడా  ఫైట్లు చేయించి దర్శకుడు, నిర్మాత తనను చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సీనియర్ సిటిజన్స్కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

వెంటనే రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపాలని పోలీస్‌ కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చాడు. అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు.  ఏది ఏమైనా ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకు వెళ్తుంది..ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో చేరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: