ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ మిల్కీ బ్యూటీ తమన్నాను ప్రమోట్ చేస్తూ ఉండటం హాట్ న్యూస్ గా మారింది. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలను ఎక్కువగా చేసిన తమన్నా  కెరియర్లో ప్రెస్టీజియస్ గా భావిస్తున్న సినిమా ‘అభినేత్రి’. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. 

ప్రభుదేవాచే  నిర్మింపబడుతున్న ఈ సినిమా పై తమ్మూ చాలా ఆశలే పెట్టుకుంది. తమన్నా తన కెరియర్ లో మొట్ట మొదటిసారి   దెయ్యం పాత్ర చేయడమే కాకుండా ద్విపాత్రాభినయం కూడా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్ అన్నీ కూడా మంచి క్రేజ్ ను సంపాధించు కున్నాయి.  

రేపు ఆగస్టు 1న తమన్నా మీద స్పెషల్ గా తయారు చేసిన టీజర్ ను కూడ ప్రభుదేవా  రిలీజ్ చేయబోతున్నాడు. ఈలోగా అంతకంటే ముందు ‘అభినేత్రి’ హిందీ వెర్షన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక పక్కన ప్రభుదేవా మరోపక్కన సోనూ సూద్ మధ్యలో తమన్నా కనిపిస్తున్న ఈ పోస్టర్ డిజైనింగ్  చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ పోస్టర్ని ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ రిలీజ్ చేయడం. 

సోనూ సూద్ తో కలిసి జాకీ చాన్ ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సామాన్యంగా బయట ఫంక్షన్స్ కు ఎంఎప్పుడో కాని రాడు. అయితే సోనూతో కలిసి ఓ యాక్షన్ సినిమా చేస్తున్న జాకీ ఆ స్నేహంతో  ఈ పోస్టర్ లాంచ్ చేశాడు అని తెలుస్తోంది. ఆగస్టు 15న ఆడియో ఫంక్షన్ జరుపుకోబోతున్న ‘అభినేత్రి’ సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక  రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: