బాయ్స్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో సిద్దార్థ్ ఆ తర్వాత అంతటి హిట్ సినిమా ఏ ఒక్కటీ తన ఖాతాలో వేసుకోలేదు.  ఈ మద్య సినిమాలపై వస్తున్న రివ్యూలపై యంగ్ హీరో సిద్దార్థ్ మీడియాలో వస్తున్న వార్తలపై మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినిమాలపై వస్తున్న రివ్యూలు, ట్విట్స్ పై అక్కసు వెల్లగక్కారు. నిమా పూర్తికాకుండానే రివ్యూ లు ఇస్తూ సినిమాని దెబ్బ తీస్తున్నారని ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారి రేటింగ్ కోసం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లు అభూత కల్పన కల్పిస్తున్నారని దాని వల్ల ఒక్క సినిమా రంగం మాత్రమే కాదు మొత్తంగా భారతీయ చలన చిత్ర రంగమే ఇబ్బందులు ఎదుర్కొటున్నారని వాపోయారు.
Image result for hero siddharth
ఎన్నో కష్టాలు పడి కోట్లు వెచ్చించి ఓ సినిమా పూర్తి చేస్తారు..కానీ సినిమా విడుదల కాక ముందే దాని గురించి రివ్యూలు ఇవ్వడం..కథలు లీక్ అయ్యాయని ప్రచారం చేయడం ఎంత వరకు న్యాయం అని ఆగ్రహవ వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా చూసిన తర్వాత దానిపై విమర్శలు చేయడం గాని ప్రశంసలు చేయడం కానీ చేస్తారు.. కొంత మంది మాత్రం సినిమా చూస్తూనే విమర్శలు చేస్తున్నారని అన్నారు.
Image result for hero siddharth
అంతే కాదు సినిమా చూస్తూ ఎలా ట్విట్ చేస్తారని మండిపడుతున్నాడు. ఈ యంగ్ హీరోకి గత కొంత కాలంగా ఏ సినిమా సక్సెస్ కాకపోవడం అప్పుడప్పుడు యాడ్స్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. దీంతో ఆ కోపాన్ని మొత్తం మీడియాపై చూపిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: