తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అందాల కలువ కళ్ల సుందరి కాజల్ అతి తక్కువ కాలంలో అగ్రహీరోలతో చాన్స్ కొట్టి నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు రాంచరణర్, బన్ని, పవన్ కళ్యాన్ లతో నటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెం.150 చిత్రంలో నటిస్తుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ బాలీవుడ్ లో ఎక్కువ పేరు సంపాదించలేక పోయింది.
Image result for kajal hot
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసు లో దూసుకు వెళ్తున్న కాజల్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ న్యూస్ చెప్పింది.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లబుచ్చింది. తాను త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు..తగిన వ్యక్తి కోసం చూస్తున్నానని, నేననుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కాజల్. ఒక్కసారి పెళ్లయ్యాక తన విషయంలో నటన ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
Image result for kajal hot
పెళ్లి తర్వాత తన చెల్లెలు కూడా మంచి లైఫ్ గడుపుతుందని పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ కుటుంబాన్ని గురించే ఆలోచిస్తారని నేనూ కూడా అలాంటి బాటలోనే నడవాలనుకుంటున్నా అని తెలిపింది. అత్తారింటి బాధ్యతలు, భర్తతో సమయం గడపడం, వ్యక్తి జీవితానికే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తానని స్పష్టం చేసింది. కాబట్టి పెళ్లైతే సినిమా ఊసే అయితే ఉండదని తేల్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: