‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తో చాల జోష్ మీద ఉన్న జూనియర్ తన తదుపరి సినిమా ఎంపిక గురించి మాత్రం తెగ టెన్షన్ పడుతున్న వార్తలు ఇప్పటికే బయటకు లీక్ అయ్యాయి.  అయితే జూనియర్ అభిమానులతో పాటు జూనియర్ సన్నిహితులు కూడ తారక్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తే బాగుంటుంది అని సూచనలు చేస్తున్నా త్రివిక్రమ్ జూనియర్ ల మధ్య రాయబారం నడిపేది ఎవరు అన్న అన్వేషణలో ప్రస్తుతం జూనియర్ చాల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్.

సినిమా రంగంలో ఇగోలు ఎక్కువగానే ఉంటాయి అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే అందరి హీరోలతోనూ అదేవిధంగా అందరి నిర్మాతలతోను సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచనలను జూనియర్ వైపు తిప్పాలి అంటే దానికి సమర్ధుడైన ఒక మధ్యవర్తి అవసరం ఉంది.  ఇప్పుడు జూనియర్ అటువంటి మధ్యవర్తి కోసమే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జూనియర్ కు ఇటువంటి పరిస్థితి గతంలో కూడ ఏర్పడింది అని అంటారు.  ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ కోసం జూనియర్ లండన్ లో ఉన్నప్పుడు దర్శకుడు కొరటాల శివను తనతో సినిమా చేయడానికి ఒప్పించడానికి సరైన మధ్యవర్తి కోసం అన్వేషించి ఇక ఎవరూ దొరక పోవడంతో తానే స్వయంగా హడావిడిగా లండన్ నుండి ప్రత్యేకంగా వచ్చి తన ఇగోలను పక్కకు పెట్టి కొరటాల శివతో మాట్లాడి ‘జనతా గ్యారేజ్’ మూవీని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు కూడ  అదే పరిస్థితి జూనియర్ కు ఏర్పడి ఒక మెట్టు దిగి స్వయంగా జూనియర్ త్రివిక్రమ్ తో మాట్లాడితే కాని జూనియర్ త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ ప్రారంభం కాదని అందువల్ల ఈ సారి కూడ ఒక మెట్టు దిగి త్రివిక్రమ్ ను కాంటాక్ట్ చేయవలసిందిగా జూనియర్ పై అతడి సన్నిహితులు ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్.  అయితే ఈ విషయంలో జూనియర్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి అని అంటున్నారు.

తాను మెట్టు దిగి త్రివిక్రమ్ ను అడిగినా త్రివిక్రమ్ తన మాటను మన్నిస్తాడా అన్న సందేహం జూనియర్ ను వెంటాడుతోంది అని టాక్.   దీనికి కారణం ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కు బందీగా మారిన నేపధ్యంలో తాను మెట్టు దిగినా ప్రయోజనం ఉండదని జూనియర్ భావన అనే టాక్ కూడ ఉంది.

దీనితో జూనియర్ త్రివిక్రమ్ విషయాన్ని పక్కకు పెట్టి తనతో సినిమాలు చేయాలి అని మోజు పడుతున్న  పూరి – అనీల్ రావిపూడి లతో పాటు కోలీవుడ్ డైరెక్టర్ లింగ్ స్వామి ఈమధ్య తనను కలిసి లేటెస్ట్ గా చెప్పిన కథల విషయమై ఆలోచిస్తూ మరో 10 రోజులలో ఈ సస్పెన్స్ కు తెర దించాలని జూనియర్ ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: