సమంతా ... కాజల్ ... తమన్నా ... వంటి జూనియర్లు ఎంతమంది తరుముకువస్తున్నా, నయనతార డిమాండు మాత్రం ఇటు టాలీవుడ్ లో కానీ, అటు కోలీవుడ్ లో కానీ ఏమాత్రం తగ్గడంలేదనే చెప్పాలి. వీళ్ళంతా ఇంచుమించు కోటి రూపాయలకు డేట్లు ఇచ్చేస్తుంటే, ఈ అమ్మడు మాత్రం 'కోటిన్నర అయితేనే నా దగ్గరకు రండి' అంటూ కరాఖండీగా చెప్పేస్తోందట. అన్నట్టుగానే, ముక్కుపిండి మరీ అంత రేటూ వసూలు చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నయన్ ఆరేడు సినిమాలు కమిట్టయివుంది. వీటికి కోటిన్నర చొప్పున చార్జ్ చేస్తోందట. అయినా కూడా తనే కావాలని పట్టుబట్టే హీరోలు, దర్శకులు వున్నారు. అందుకే, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని ఈ అమ్మడు అక్షరాలా పాటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: