దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తలలో ఉంటాడు. తన తాజా సినిమా 'సైకో'ను ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమాగా అభివర్ణిస్తూ తన ట్విటర్ లో సందేశాలు పెడుతున్నాడు. అమ్మాయిలను వేధించే ఒక యువకుడి యదార్ధ గాధగా తాను ఈ సినిమాకు స్క్రిన్ ప్లేన్ సమకుర్చానని చెబుతున్నాడు. వర్మ పద్దతికి విరుద్ధంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు చాలా ఆలస్యంగా మొదలై నేడు ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది.

వర్మ సినిమాలు అంటే అమ్మాయి లు పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ సినిమా ప్రతి అమ్మాయి చూడవలసిన సినిమా అని ప్రత్యేకంగా వర్మ చేస్తున్న ప్రచారానికి ఇష్టపడి ఎంత మంది అమ్మాయిలు దీయేటర్ల దగ్గరకు వస్తారన్నది ప్రశ్న. వర్మ తీసే దెయ్యాల సినిమాలు చూడడానికి అమ్మాయిలు చాలామంది ఇష్టపడరు, అలాంటిది అమ్మాయిలను ఏడిపించే ఒక సైకో యద్దార్ధ గాధను సినిమా గా చూపెడతాను రండి అంటే ఎంత మంది ధైర్యంగా వచ్చి దీయేటర్ల లలో కుర్చుని చుదగాలరో చూడాలి .

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఇష్టపడరు.దెయ్యాలు, మాఫియా వర్మకు ఇష్టమైన అంశాలు. ఆ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు వేరు. ఇటువంటి సినిమాలు తీసితీసి వర్మకు కూడా విసుకోచ్చింది అనుకుంటాను ఇక తాను కూడా చాలా మంది దర్సకులులా చక్కగా ప్రేమ కధా చిత్రాలు తీస్తానని ఈ మధ్యనే ఓపెద్ద భారీ స్టేట్ మెంట్ వదిలేసాడు. పరిస్థుతులను బట్టి మారిపోతున్న వర్మ దర్శకత్వం లో విడుదల అవుతున్న ఈ సైకోను వర్మ మాటలు మన్నించి ఎంత మంది అమ్మాయిలు చూస్తారో మరి చూడాలి...... 

మరింత సమాచారం తెలుసుకోండి: