పవన్ కళ్యాణ్ ను అంచనా వేయడం అతడి ఆలోచనలు అర్ధం చేసుకోవడం చాల కష్టమని అతడి సన్నిహితులు కూడ చెపుతూ ఉంటారు.  పవన్ ఆలోచనలు తనకు పూర్తిగా అర్ధం కావు అని అతడి అన్న చిరంజీవి అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు అంటే పవన్ వ్యక్తిత్వం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో అర్ధం అవుతుంది.

ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ తనకు ఈమధ్య ఇచ్చిన ఒక సలహా విషయం బయట పెట్టాడు. పవన్ విపరీతంగా పుస్తకాలు చదువుతాడు అన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ నాగబాబును ప్రముఖ ఆంగ్ల రచయిత రిచర్డ్ బాచ్ రచించిన ‘జోనాధన్ లివింగ్ స్టోన్ సీగల్’ పుస్తకాన్ని చదవమని సూచించాడట. 

పవన్ సూచించిన ఈ పుస్తకం విషయంలోకి వెళితే సముద్రం పై నిరంతరం ఎగిరే పక్షుల జీవితం పై వ్రాసిన పుస్తకం ఇది.  ఈ పుస్తకంలో రచయిత వ్యతిరేక పరిస్థుతులలో పోరాటం చేస్తూ ఒక మనిషి ఎలా ఎదగాలి అదేవిధంగా వేగవంతమైన ఈ యాంత్రిక ప్రపంచంలో మనిషి తనను తాను తెలుసుకునే విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి అన్న విషయాన్ని పవన్ నాగబాబుకు వివరించాడట. 

ప్రస్తుతం నాగబాబు ఈ పుస్తకం గురించి చెప్పడంతో పవన్ అభిమానులు కూడ ఈ పుస్తక విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ లో తెగ సర్చ్ చేస్తున్నట్లు టాక్.  అయితే ఎంతో వేదాంత పరమైన భావాలతో ఉన్న ఈ పుస్తకం పవన్ అభిమానులకు ఎంత అర్ధం అవుతుందో తెలియక పోయినా ఒక మంచి పుస్తకం గురించి పవన్ అభిమానులకు తెలిసింది అనుకోవాలి. 

ఇదిఇలా ఉండగా చేనేతకు బ్రాండ్‌ వస్త్రాలకు పవన్ బ్రాండ్ అంబాసిడర్‌ గా మారి చేనేత అనేది ఓ గొప్ప కళ అనీ అది మన జాతీయ సంపద అని చెబుతూ ఉండటంతో పవన్ మాటలను అనుసరించి లక్షలాది సంఖ్యలో ఉన్న పవన్ అభిమానులు కనీసం చేనేత వస్త్రాలకు సంబంధించిన ఒకొక్క జత అయినా నిజంగా కొంటే పవన్ మాటలకు పవన్ అభిమానులు విలువను ఇచ్చినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: