పవన్ చిరంజీవిలు రాజకీయంగా కలవడం ఇప్పటి కిప్పుడు అసాధ్యం అయినా అటువంటి సంఘటన ఏదో జరగబోతోంది అన్న అనుమానాలు మెగా బ్రదర్ నాగబాబు మాటలు విన్నవారికి కలుగుతాయి. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన వీకెండ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో నాగబాబు తన గురించి తమ మెగా బ్రదర్స్ సాన్నిహిత్యం గురించి అనేక విషయాలు లీక్ చేసాడు. 

తానూ రాజకీయాల్లో పోటీ అంటూ చేస్తే ‘జనసేన’ తరపున మాత్రమే చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన నాగబాబు ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు సహాయ సహకారాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు. నాగబాబు ఆలోచనల ప్రకారం వచ్చే  ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘జనసేన’ తరపున ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మాటకొస్తే  ఒక్క చిరంజీవే కాదు, మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు తోడుగా నిలవాలన్నది తన కోరిక అని అంటున్నాడు నాగబాబు.  

చిరంజీవికి అత్యంత ప్రియమైన తమ్ముడుగా పేరుగాంచిన నాగబాబు ఎదో ఒక వ్యూహంతో ఈ మాటలు అని ఉంటాడు అంటూ అప్పుడే ఈ మెగా బ్రదర్ కామెంట్స్ పై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో నాగబాబు గతంలో తనకు కలిగిన ఆత్మహత్య ఆలోచనలు గురించి కూడ వివరించాడు. 

తనకు గతంలో ‘ఆరెంజ్’ సినిమా వల్ల వచ్చిన నష్టాలు వల్ల తనకు విపరీతమైన బాధ కలగడంతో తాను అప్పట్లో ఆత్మహత్య చేసుకుందామని ఆలోచనలు చేసిన విషయం వాస్తవమే అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టాడు నాగబాబు.  ఆ పరిస్థుతులలో తన అవసరాల కోసం తాను తరుచుగా చిరంజీవి పవన్ ల దగ్గర నుంచి తన అవసరాల కోసం డబ్బు తీసుకున్న విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండా బయట పెట్టాడు నాగబాబు. 

ఆ సమయంలో విపరీతమైన నిరాశతో ఉన్న తనకు అన్నివిధాల మేమున్నాం అంటూ సహాయపడ్డ చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మాటలు  వారు మరిచిపోయినా ఇప్పటికీ తనకు గుర్తున్నాయి అంటూ చిరంజీవి పవన్ లపై తన ప్రేమను వ్యక్త పరిచాడు ఈ మెగా బ్రదర్. అయితే నాగబాబు చిరంజీవి పవన్ ల రాజకీయ కలయిక గురించి ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి పవన్ చిరంజీవిల మెగా మూవీ ప్రకటన తరువాత నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఎదో ఒక ఆంతర్యం ఉంది అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: