నందమూరి సింహం బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల అయిన తరువాత తన వేగాన్ని మరింత పెంచుతూ తన తదుపరి సినిమాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీసే నిర్ణయం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఉంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఆ శక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలి అన్న ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ ది అనితేలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ గా జూనియర్ నటించడానికి ఈసినిమాకు దర్శకత్వం వహించడానికి పూరి జగన్నాథ్ కు మధ్య కొన్ని ప్రాధమిక చర్చలు కూడ జరిగినట్లు టాక్. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసినిమాను జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించి 2018లో ఈమూవీని మొదలుపెడదాము అని అనుకున్నారట. ఈలోపున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేసే విషయంలో కొంతమంది రచయితలతో చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది.  అయితే అనుకోకుండా ఈ న్యూస్ బాలయ్య కాంపౌండ్ కు చేరడంతో జూనియర్ ఆలోచనలను అడ్డుకట్టలు వేస్తూ బాలకృష్ణ తన వేగాన్ని పెంచి ఈ బయోపిక్ ను ప్రకటించాడు అని ఫిలింనగర్ గాసిప్. 

అయితే ఈరోజు ఒక జాతీయ ఆంగ్ల దిన పత్రిక కథనం ప్రకారం ఈసినిమాను సిసిఎల్ ఫౌండర్ విష్ణు ఇందూరి నిర్మాతగా నిర్మించబోతున్నాడని ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు బాలకృష్ణ నటించబోయే ఈ ఎన్టీఆర్ బయోపిక్ కు ఇప్పటి వరకు కొంత స్క్రిప్ట్ పై పనిచేసిన పూరి జగన్నాథ్ కే దర్శకత్వ అవకాసం కూడ బాలకృష్ణ ఆలోచనలో ఉంది అన్న వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. 

ఏది ఏమైనా బాలకృష్ణ ఆలోచనలకు జూనియర్ ఎన్టీఆర్ ప్రాతిపదిక కావడం ఒక విధంగా ఆశ్చర్యపోయే విషయం. ఇక రానున్న రోజులలో ఈసినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆశ్చర్యకర వార్తలు బయటకు వస్తాయో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: