పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అతడి సన్నిహితులు మరియు అభిమానులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రచారాలు చేస్తూ ఉంటే నిన్న పవన్ తమకు ఇచ్చిన మాట తప్పాడు అంటూ కొందరు పవన్ పై విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది.  పవన్ తరుచు మాట ఇస్తే ఖచ్చితంగా పాటించాలి అని చెప్పే నేపధ్యంలో ఇప్పుడు పవన్ చెప్పిన మాటలే నీటి బుడగలుగా మారిపోయాయి అంటూ విమర్శలు మొదలయ్యాయి.

నిన్న కృష్ణాజిల్లాకు సంబంధించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్ ప్రెస్ మీట్ పెట్టి తనను మాత్రమే కాకుండా తన లాంటి ఎందరో నష్టపోయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బయ్యర్లకు పవన్ ఇచ్చిన మాట తప్పాడు అంటూ ఆరోపణలు చేస్తూ ప్రెస్ ముందుకు వచ్చాడు. ‘సర్దార్’ బాధితుల్లో ఒకరైన కృష్ణాజిల్లా బయ్యర్ సంపత్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏడాది కాలంగా తనను వెయిటింగ్ లిస్ట్ లో వుంచి ఇప్పుడు ‘కాటమరాయుడు’ విషయంలో మాటతప్పి మొండిచేయి చూపించారని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు.

పవన్ ఆఫీసుకు వెళితే అపాయింట్ మెంట్ కూడ ఇవ్వలేదని శరద్ మురార్ అండ్ కో ఫోన్ లు లిఫ్ట్ చేయలేదని  పైగా మధ్యవర్తుల ద్వారా మాట్లాడిస్తే, బెదిరిస్తున్నారని సంపత్ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. పవన్ కారణంగా రెండుకోట్లు కోల్పోయి న్యాయం అడిగితే పరువు నష్టం దావా వేస్తామంటున్నారని  అంటూ సంచలనవ్యాఖ్యలు చేసాడు. 
 
ఇప్పుడు ఈన్యూస్ సంచలనంగా మారింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను కొనుక్కుని నష్టపోయిన ఎంతోమంది బయ్యర్లు ఇదేవిధంగా ప్రెస్ ముందుకు వస్తే బిజినెస్ పరంగా ‘కాటమరాయుడు’ కు సమస్యలు ఏర్పడతాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిఇలా ఉండగా ‘సర్దార్’ సినిమాను నైజాం ప్రాంతానికి  కొనుక్కుని  ఏడుకోట్లు కోల్పోయిన  డిస్ట్రిబ్యూటర్ కూడ ఇదే బాటపడతాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో శరత్ మురార్ రంగంలోకి దిగి  ‘సర్దార్’  మూవీ  వల్లనష్టపోయిన బయ్యర్లు అందరితోను చర్చలు జరిపి ఒకపరిష్కారం కనుక్కునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఒకవైపు పవన్ తన ‘జనసేన’ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తన పదునైన ప్రశ్నలు మాటలతో ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏకంగా పవన్ ను బహిరంగంగా ఇరుకున పెట్టడానికి ‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనిని బట్టి చూస్తుంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కష్టాలు పవన్ ను ఇంకా వెంటాడుతున్నాయనే అని పిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: