‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ సినిమాలో నటించిన తమన్నాకు చెప్పుకోతగ్గ అవకాశాలు టాలీవుడ్ లో రాలేదు. టాప్ యంగ్ హీరోలు అంతా తమన్నా వైపు చూడటం మానేసి కొత్త క్రేజీ హీరోయిన్స్ వైపు చూస్తూ ఉండటంతో తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ ను విడిచి కోలీవుడ్ లో సినిమాలు చేసుకుంటోంది. 

ఈ నేపధ్యంలో తమన్నాకు ఊహించని బ్రేక్ దొరకడమే కాకుండా బాలకృష్ణ హీరోయిన్ సమస్యలకు పరిష్కారం కూడ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య సినిమాల దర్శకులకు హీరోయిన్ వేట ప్రధాన సమస్యగా మారడంతో గతంలో బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ దొరకడమే ఒక అద్భుతంగా మారిపోయింది. 

ఇప్పుడు ఆసమస్యలు తీరిపోయాయి. నందమూరి సింహం ప్రక్కన మిల్కీ బ్యూటి రోమాన్స్ చేయబోతోంది.  కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం త్వరలో కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే మూవీకి తమన్నాను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ 101వ సినిమాకు హీరోయిన్ గా తిరిగి శ్రియను తీసుకుంటారు అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు శ్రియ స్థానంలో తమన్నా వచ్చి చేరడం ఆశ్చర్యంగా మారింది.  ఇప్పటికే దర్శకుడు రవి కుమార్ తమన్నాకు ఈసినిమాకు సంబంధించిన కథను వివరించడం ఆమె అంగీకారం పొందడం కూడ జరిగిపోయాయి అని అంటున్నారు.  

ఈవార్తలే నిజమైతే ఇప్పటి వరకు టాప్ యంగ్ హీరోలతో రోమాన్స్ చేసిన తమన్నా మొట్టమొదటి సారిగా ఒక టాప్ సీనియర్ హీరోతో కలిసి నటించబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తయారుచేసిన కథను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు బాలకృష్ణ పై ప్రయోగిస్తున్న దర్శకుడు రవి కుమార్ తన ప్రయోగంలో తమన్నాను కూడ కలపడం ఎంత వరకు విజయవంతం అవుతుంది అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: