పవన్ కళ్యాణ్ ఇచ్చిన హిట్ తో అప్పటి వరకు ఐరన్ లెగ్ బ్యూటి అనిపించుకున్న శృతిహాసన్ ‘గబ్బర్ సింగ్’ ఇచ్చిన ఘన విజయంతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ గా మారిపోవడమే కాకుండా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా కూడ మారిపోయింది శృతి.  ప్రస్తుతం ఆమె హవా దక్షిణాది సినిమా రంగం అంతా కొనసాగుతూ ఉన్నా పవన్ పై ఉన్న కృతజ్ఞతతో ‘కాటమరాయుడు’ సినిమాకు పవన్ కోరుకున్న విధంగా ఆమె డేట్స్ ఇచ్చి పవన్ పట్ల తన కృతజ్ఞతను చాటుకుంది శృతి.

ప్రస్తుతం వీరిద్దరూ ఈసినిమాకు సంబంధించి పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళిన నేపధ్యంలో వీరిద్దరి పై ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. సామాన్యంగా పవన్ తన సినిమాలలో నటించే హీరోయిన్స్ తో పెద్దగా సన్నిహితంగా ఉండడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి.

అయితే దీనికి భిన్నంగా పవన్ శ్రుతిహాసన్ లు ‘కాటమరాయుడు’ సెట్స్ పై మంచి సన్నిహితంగా ఉంటున్నారని ఫిలింనగర్ టాక్. దీనికితోడు శృతి కూడ పవన్ తో మరింత క్లోజ్ గా ఉంటూ తరుచూ చాల విషయాల పై సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారని ఆ సినిమా యూనిట్ సభ్యుల నుంచి లీక్ అవుతున్న న్యూస్ అని అంటున్నారు. 
అయితే ఈ సాన్నిహిత్యంతో పవన్ ఈమధ్య శ్రుతికి ఒక గట్టి క్లాస్ పీకాడు అని టాక్. దీనికి కారణం  శృతి తాను సౌత్ సినిమాలకు దూరం అవుతానని తన దృష్టి అంతా బాలీవుడ్ సినిమాల పైనే పెడదామని అనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని పవన్ కు చెపుతూ పవర్ స్టార్ సలహా కోరిందట. 

అయితే పవన్ ఈమాట విని షాక్ అవ్వడమే కాకుండా శృతిహాసన్ కు గట్టి క్లాస్ పీకాడని అంటున్నారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఎంత గొప్పదో వివరిస్తూ కమలహాసన్ కుమార్తెగా ఆమెకు దక్షిణాది సినిమా రంగంలో లభిస్తున్న గౌరవం బాలీవుడ్ లో లభించదు అని అభిప్రాయ పడ్డాడట పవన్.

ఈమధ్య కాలంలో చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ సినిమాలో శృతి హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో శ్రుతి మెగా కాంపౌండ్ నుండి జారిపోకుండా ఇలాంటి క్లాస్ టాలీవుడ్ ఎంపరర్ శృతి హాసన్ కు ఇచ్చాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: