విభిన్నమైన సినిమాలకు చిరునామాగా ఉండే దర్శకుడు సుకుమార్ క్రేజ్ తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంది. దీనితో టాప్ యంగ్ హీరోలు కూడ సుకుమార్ తో సినిమాలు చేయడానికి తమ ఆసక్తిని కనపరుస్తూనే ఉన్నారు. అయితే సుకుమార్ తనకు ఉన్న క్రేజ్ తో వరస పెట్టి సినిమాలు చేయకుండా అతి నెమ్మదిగా తన డైరెక్టర్ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఈ నేపధ్యంలో సుకుమార్ ప్రారంభించబోతున్న ఒక లేటెస్ట్ బిజినెస్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పుడు ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం సుకుమార్ ఫ్యామిలీ మెంబర్లు కొంతమంది స్నేహితులు కలిసి కార్పొరేట్ లెవెల్ లో డ్రై క్లీనింగ్ ఇండస్ట్రీ ఒకటి కాస్త భారీగా స్టార్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నానక్ రామ్ గూడలో ఒక ప్లాంట్ కూడ భారీగా కనస్ట్రక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

రైల్వేస్, హోటల్స్, హాస్పిటల్స్ లాంటి భారీ క్లయింట్ లను ఆధారంగా తీసుకుని భారీ టర్నోవర్ ను టార్గెట్ చేస్తూ ఈ బిజినెస్ ఏర్పాటు చేస్తున్నట్లు టాక్.  సామాన్యంగా సినిమా రంగంలో బాగా సంపాదించిన వాళ్ళు రియలెస్టేట్ లో లేదంటే సినిమా ధియేటర్స్ నిర్మాణంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. 

కాని దీనికి భిన్నంగా పెద్ద స్థాయిలో ఇటువంటి వెరైటీ బిజినెస్ ప్రస్తుతం సుకుమార్ పెడుతూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. డ్రైక్లీనింగ్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఒక ప్రముఖ కార్పోరేట్ కంపెనీతో అనుసంధానం చేస్తూ సుకుమార్ ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. 

సినిమాల నిర్మాణ విషయంలో హీరోలను డిఫరెంట్ లుక్ తో చూపించే విషయంలో ఎప్పుడు ముందు వరసలో ఉండే సుకుమార్ కొత్త బిజినెస్ ఆలోచనలు కూడ డిఫరెంట్ గా ఉండటం సుకుమార్ విలక్షణ వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: