ఒకే ఒక్క సినిమా సూపర్ హిట్ తో దర్శకుడు హరీష్ శంకర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయి పోయాడు. అది ‘గబ్బర్ సింగ్’ అన్న విషయం అందరికి తెలుసు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఅర్ ‘బాద్ షా’ సినిమా తరువాత తన దృష్టి అంతా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాపై పెట్టాడు. ఈ సినిమా పూర్తి అయ్యే వరకూ తాను నటించాల్సి ఉన్న ‘రబస’ సినిమాను కూడా వాయిదా వేసుకున్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ట్రైలర్ లోని బుడ్డోడి డైలాగ్ సూపర్ క్లిక్ అవడంతో ఈ సినిమాపై ఎన్టీఅర్ అభిమనులు చాలా అంచనాలు పెట్టేసుకుంటున్నారు. కాని ఈమధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న స్టిల్స్ చూసిన నందమూరి అభిమానులకు కొత్త సందేహాలు వస్తున్నాయట.

గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ఎలా చూపెట్టాడో, ఇప్పుడు రాబోతున్న రామయ్య వస్తావయ్య లో కూడా అలాగే చూపెడతాడేమో అన్న భయం యంగ్ టైగర్ అభిమనులను పీడిస్తోందట.  పైన కనిపిస్తున్న స్టిల్స్ లో ఎన్టీఅర్ బాడీ లాంగ్వేజ్ మూమెంట్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని బాడీ లాంగ్వేజ్ మూమెంట్ లా ఉందని,   ఒకే రకం బాడీ లాంగ్వేజ్ తో కూడుకున్న మూమెంట్స్ ఎన్టీఅర్ తో హరీష్ శంకర్ ఎందుకే చేయిస్తున్నాడు అంటూ మధన పడడమే కాకుండా ఇలాంటి ఎనేర్జిటిక్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ఎన్టీఅర్ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకొని తియ్యాలి కాని గబ్బర్ సింగ్ సినిమాలోని స్టిల్స్ ను మళ్ళి చూస్తున్నట్లుగా అనిపించేటట్టు సినిమా తీసి చేట్టేస్తే అది ఎన్టీఅర్ ఇమేజ్ కు చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది.

ఈ చిన్న విషయాలను కూడా హరీష్ శంకర్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ నందమూరి అభిమానులు భయపడడమే కాకుండా అసలు ఈ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందో అంటూ తెగ మధనపడి పోతున్నారట. కాబట్టి గబ్బర్ సింగ్ సినిమా సీన్స్ ఏమాత్రం పొంతన లేకుండా హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్య’ తీస్తాడని ఆశిద్దాం.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: