కొంతకాలం క్రితం రామ్ చరణ్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ప్రతిరోజు అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడు తాను మహేష్ బాబులాంటి అందంతో తాను ఎందుకు పుట్టలేదు అని జలసీ ఫీల్ అవుతూ ఉంటాను అంటూ అప్పట్లో ఓపెన్ గా చెప్పాడు చరణ్. అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడ మహేష్ అందాన్ని పొగుడ్తూ మొన్న జరిగిన ‘ఐఫా’ అవాడ్స్ మీటింగ్ లో కామెంట్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. 

ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘ఐఫా’ అవార్డ్స్ నైట్ లో ఉత్తమ నటుడు అవార్డ్ ను అందుకున్న తరువాత తనను ఇంటర్వ్యూ చేసిన రానా తో మాట్లాడుతూ జూనియర్ ఈ కామెంట్స్ చేసాడు. టాలీవుడ్ లో అత్యంత అందగాడు ఎవరని రానా అడిగిన ప్రశ్నకు జూనియర్ సమాధానం ఇస్తూ టాలీవుడ్ అందగాడు మహేష్ అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక నటుడుగా నాని అంటే తనకు ఇష్టమని జూనియర్ కామెంట్ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వాయస్ పరంగా తనకు రానా గొంతు అంటే చాల ఇష్టం అని చెపుతూ ఏకంగా తనకు ప్రశ్నలు అడుగుతున్న రానాను బుట్టలో పెట్టడానికి ప్రయత్నించాడు తారక్. 

దీనితో తారక్ నోటి వెంట మహేష్ అందం ప్రస్తావన రావడంతో ‘ఐఫా’ కార్యక్రమాన్ని బుల్లితెర పై చూస్తున్న మహేష్ అభిమానులు తెగ ఎంజాయ్ చేసారు. గతంలో కొంతమంది మహేష్ అభిమానులు జూనియర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన నేపధ్యంలో ఇప్పుడు యంగ్ టైగర్ చాల వ్యూహాత్మకంగా మహేష్ అందాన్ని పొగుడ్తూ ఏకంగా మహేష్ అభిమానులనే బుట్టలో పెట్టేయడం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది డేగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: