తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన గొప్ప దర్శకులు మణిరత్నం.  ఈయన సినిమాలో చాన్స్ వచ్చిందంటే హీరో, హీరోయన్లు పండుగలా ఫీల్ అవుతారు.  ఫిల్మ్ మేకింగ్ లో  ఎప్పుడూ తనదైన స్టైల్ ఫాలో అవుతారు మణిరత్నం. గీతాంజలి, రోజా, బాంబే వంటి చిత్రాలు ఎప్పటికీ మర్చిపోం...అంతే కాదు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఆయన సినిమాలన్నీ సున్నితమైన భావోద్వేగాలతో కూడి ఉంటాయి. గత కొంత కాలంగా మణిరత్నం సినిమాలు పెద్దగా విజయాలు సాధించడం లేదు.
Image result for cheliya movie stills
ఆ మద్య నిత్యామీనన్, దుల్కన్ సల్మాన్ తో తీసిన ఓకే బంగారం’ చిత్రం పరవాలేదనిపించే విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ రోజు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెలియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇందులో కార్తి, అతిధి రావు లు జంటగా నటించారు.  ఈ చిత్రంలో కార్తీ  రెండు రకాలు గా కనిపిస్తున్నాడు..ఒక పాత్రలో పైలెట్ గా మీసాలు లేకుండా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరో పాత్రలో ఖైదీ గా నెరిసిన గడ్డం,మీసాలతో కనిపిస్తున్నాడు.  ఒకప్పుడు రోజా సినిమాను తలపించేలా కనిపిస్తున్న కాన్సెప్ట్ మాత్రం చాలా మారింది.

చెలియా చిత్రంలో మణిరత్నం పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ కథని ఎంచుకున్నారు. మొదటి అర్థ భాగం పరవాలేదనిపించే విధంగానే సాగింది. ఇక రెండవ భాగంలో మాత్రం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. సినిమాలో ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ లోకి రావడం చూపిస్తున్నారు.  కానీ సినిమా పిక్చరైజేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.  మ్యూజిక్ కూడా  సిచ్ వేషన్ బట్టి చాలా అద్భుతంగా వచ్చింది. మణిరత్నం స్టైల్ లోని చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయ్.కానీ సాధారణ ఆడియన్స్ కి మాత్రం ఈ చిత్రం బోర్ కొడుతుంది.
Image result for mani ratnam
వాస్తవానికి మణిరత్నం సినిమాలు అంటేనే స్లోగా సాగుతాయి. కానీ ఈ మద్య సగటు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో ఎంట్రటైన్ మెంట్...ఫన్, ఫైట్స్ కోరుకుంటున్నారు. చిత్రం స్లోగా ఉన్నా అందులో బలమైన భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు ఉంటే నెట్టుకుని రావచ్చు.  మొత్తానికి సినిమాలో కార్తి మరియు అతిది రావు ల జోడీ ,అందమైన లొకేషన్ లలో సినిమాని చిత్రీకరించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. ఏది ఏమైనా రేపటి కలెక్షన్లను బట్టి సినిమాపై అంచనా వేసుకోవొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: