అందమైన నవ్వుతో చంద్రబింబం లా కనిపించే సమంత ప్రస్తుతం దక్షణాది లో టాప్ హీరోయిన్. ఆమె కాల్ షీట్స్ ఇస్తే ఎంత పెద్ద హీరో అయిన వెంటనే డేట్స్ ఇచ్చేస్తాడు, నిర్మాతలు కోట్లు గుమ్మరిస్తారు. అటువంటి స్టార్ హీరోయిన్ సమంతా బయట ఫంక్షన్స్ కు వస్తున్నప్పుడు ఆమె ఎంత నవ్వుతూ కనిపించినా లోలోపల ఎప్పుడూ ఎదో పోగొట్టుకున్నట్లు గా కనిపిస్తుందనీ ఆ నవ్వులో సహజత్వం లోపిస్తోందనీ ఆమెను అతి దగ్గరగా పరిసీలిస్తున్నావాళ్ళు అంటున్నారు.

అంతేకాదు ఎవరైనా ఆమెకు బాగా దగ్గరైన వారు కనిపిస్తే వెంటనే తన బాధను వెళ్లగక్కేస్తోందట. ఇంతకీ ఆమె బాధ ఏమిటి అనుకుంటున్నారా? ప్రస్తుతo సమంత వెబ్ మీడియా పేరు వింటే హడాలిపోతోందట. గతంలో తనకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి అంటూ అల్లరి పెట్టిన వెబ్ మీడియాను భూతంలా చూస్తోంది సమంత. తనకు కాస్త మానసిక ఉల్లాసం ఇవ్వడానికి సరదాగా తనేదైనా ట్విట్ చేస్తే అది భూతద్దంలో చూస్తూ రకరకాల అర్ధలతో తనను బజారునపెడు తున్నారనీ ఇటీవల తనను కలిసిన ఒక ప్రముఖ సినీ విమర్శకుడు తో తన బాధను షేర్ చేసుకుందట. అయితే ఆ విమర్శకుడు ఏమిమాయ చేసాడో తెలియదు కానీ సమంత నిన్న జరిగిన 60వ ఫిలింఫేర్ దక్షణాది నామినేషన్ల ప్రకటన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సమంత చాలా ఆనందంగా కనిపించడమే కాకుండా తాను ఎట్టి పరిస్తుతులలోను బాలీవుడ్ కు వెళ్ళననీ తన దృష్టి అంతా తెలుగు, తమిళ సినిమాల పనే అంటూ మరొకసారి గట్టిగా చెప్పింది ఈ క్యూట్ బ్యూటి.

వెబ్ మీడియా అంటే భయపడిపోయే సమంతా, తన ప్రస్తుత స్నేహితుడు సిద్దార్ధ తో సమానంగా తన ట్విట్టర్ ను ప్రేమిస్తూ ఎందుకు రోజుకు ఒక సందేశం పెడుతుందో మరి ఈ బ్యూటీ కే వదిలేద్దాం.... 

మరింత సమాచారం తెలుసుకోండి: